Kottu Satyanarayana : భారత్ అని పేరు మార్చినంత మాత్రాన..- దేశం పేరు మార్పు వార్తలపై మంత్రి కొట్టు సత్యనారాయణ హాట్ కామెంట్స్

ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నారని భారత్ అనే పేరు పెడుతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి.

Kottu Satyanarayana - Bharat (Photo : Google)

Kottu Satyanarayana – Bharat : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందా? మన దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చనుందా? ఆ దిశగా అడుగులు వేస్తోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. అసలేం జరిగిందంటే.. జీ20 దేశాధినేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 9న విందు ఇవ్వబోతున్నారు. ఈ సందర్భంగా విందు కోసం రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రికలను పంపింది. ఈ ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని ఉంది. అంతే, దేశం పేరు మార్పుపై ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

దేశం పేరు మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాయకులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు, పౌరులు… ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. కొందరు పేరు మార్పుని సమర్థిస్తున్నారు, మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇక, ఈ వ్యవహారంపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సైతం స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు.

Also Read..India Name Change: ఇండియా పేరు మార్పుపై పిటిషన్‭ను కొట్టివేస్తూ సూటిగా ఓ ప్రశ్న అడిగిన సుప్రీంకోర్టు

”ప్రతిపక్షాలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నారని దేశానికి భారత్ అనే పేరు పెడుతున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. ఇండియా పేరు భారత్ గా మార్పు చేయాలనుకోవడంపై అభిప్రాయం మా నాయకుడు చెబుతాడు. మా నాయకుని అభిప్రాయమే మా అభిప్రాయం. ఏవేవో ఊహాగానాలు వస్తున్నాయి. మేమేం చెబుతాం. భారత్ అని పేరు మార్చినంత మాత్రాన బయటి వాళ్లు ఇండియా అని పిలకుండా ఉంటారా..? మేం ఇండియాలోనూ లేము, ఎన్డీఏలోనూ లేము” అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

Also Read..Jamili Elections: జమిలి ఎన్నికలకు ఉన్న అవాంతరాలేంటి.. తెలంగాణ ఎన్నికల వాయిదాకు అవకాశం ఉందా?

జీ-20 దేశాధినేతలకు ఇచ్చే విందు కోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటంపై కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. దేశం పేరును త్వరలో ఇండియా నుండి భారత్‌గా మార్చనున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. రాజ్యాంగాన్ని సవరించి ఈ మేరకు తీర్మానం చేయవచ్చనే విశ్లేషణ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

మరోవైపు ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు 5 రోజులు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. అయితే ఈ సమావేశాల అజెండా ఏంటనేది ఇంతవరకు వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో.. ఇండియా పేరును భారత్ గా మార్చేందుకే ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారనే చర్చ కూడా నడుస్తోంది. విపక్షాలు తమ కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ కూటమిపై బీజేపీ నిప్పులు చెరిగింది. దేశం పేరు ఎలా పెట్టుకుంటారంటూ బీజపీ నేతలు మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ ఆహ్వాన పత్రిక పెను దుమారానికి దారి తీసింది.

ట్రెండింగ్ వార్తలు