KS Bharat : సీఎం జగన్‌‌‌పై ప్రశంసల వర్షం కురిపించిన భారత జట్టు క్రికెటర్

KS Bharat : ఇలాంటి ప్రోత్సాహం వల్ల ముందు ముందు తన లాంటి క్రీడాకారులు మరింత మంది వెలుగులోకి వస్తారని భరత్ ఆకాంక్షించారు.

KS Bharat Meets CM Jagan (Photo : Google)

KS Bharat – YS Jagan Mohan Reddy : భారత క్రికెట్ ప్లేయర్ కేఎస్‌ భరత్‌ (కోన శ్రీకర్‌ భరత్‌) సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేఎస్‌ భరత్‌ను అభినందించారు ముఖ్యమంత్రి జగన్. క్రికెట్ టీమ్ సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి బహుకరించారు కేఎస్‌ భరత్‌.

జగన్‌ సీఎం అయిన తర్వాత ఇండియన్‌ క్రికెట్‌ టీంకు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం, టెస్ట్‌ కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు గర్వంగా ఉందన్నారు భరత్. ఇందుకు సీఎం జగన్ కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ తనకు ఒక ఇన్సిపిరేషన్‌ అన్నారు. ఒక క్రికెటర్‌గా మీ మద్దతు నాకు అవసరం అని ముఖ్యమంత్రి జగన్ తో చెప్పానన్నారు.

Also Read..Sattenapalle Constituency: సత్తెనపల్లిలో అంబటి రాంబాబుని ఢీకొట్టడం కన్నా లక్ష్మీనారాయణ వల్ల అవుతుందా?

దేశం గర్వపడేలా, మన రాష్ట్ర పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సీఎం జగన్ సూచించారని భరత్ వెల్లడించారు. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయని, అలాగే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ కూడా బావుందని కేఎస్ భరత్ అన్నారు. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం చాలా బావుందన్నారు కేఎస్ భరత్. ఇలాంటి ప్రోత్సాహం వల్ల ముందు ముందు తన లాంటి క్రీడాకారులు మరింత మంది వెలుగులోకి వస్తారని భరత్ ఆకాంక్షించారు.