Ngt (1)
Rayalaseema lift irrigation : రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చెన్నై ఎన్జీటీలో విచారణ జరిగింది. జస్టిస్ కె. రామకృష్ణన్, డాక్టర్ కె. సత్యగోపాల్ లతో కూడిన బెంచ్ ముందు సుదీర్ఘ వాదనలు వినిపించారు. కోర్టు ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటికి ఉందా? లేదా? అన్న అంశంపై ఏపీ వాదనలు ముగిశాయి. ఏపీ వాదనలపై వచ్చే మంగళవారం పిటిషనర్ గవినోళ్ళ శ్రీనివాస్ తరపు న్యాయవాది, తెలంగాణ న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.
ప్రజా ఉపయోగం కోసం చేసే పనులకు మమ్మల్ని జైలుకు పంపుతారా అని ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది వెంకట రమణి వాదించారు. ఇప్పటి వరకు చేసినవి డిపిఆర్ సహా ఇతర వాటికోసం పనులేనని స్పష్టం చేశారు. కొంత ఎక్కువ చేసినంత మాత్రాన అధికారులను జైలుకు పంపాలని పిటిషన్ వేస్తే ఎలా అని ఏపీ ప్రభుత్వం అడిగింది. ఇప్పటి వరకు చేసిన పనులు పూడ్చివేయమంటారా అని ఏపీ తరపు న్యాయవాది అన్నారు. ప్రజా ఉపయోగ కార్యక్రమాల కోసం చేసే చర్యలను న్యాయస్థానం అర్థం చేసుకోవాలని, ఏపీ చీఫ్ సెక్రెటరిని జైలుకు పంపాలన్న పిటిషన్ ను కొట్టివేయలని ఏపీ ప్రభుత్వం కోరింది.
NGT on Rayalaseema: రాయలసీమ ఎత్తిపోతల పనులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటి
కోర్టు ధిక్కార పిటిషన్ లో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిడ్ అవ్వడం పట్ల ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పెడరల్ విధానంలో రాష్ట్రాల మధ్య సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి కానీ అధికారులను జైలుకు పంపాలన్న పిటిషన్ తెలంగాణ రాష్ట్రం వేయడంపై ఏపీ ప్రభుత్వ తరపు సీనియర్ న్యాయవాది వెంకట రమణి అభ్యంతరం తెలిపింది.
కోర్టు ధిక్కరణపై చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటికి ఉందని తెలంగాణ, గవినోళ్ళ శ్రీనివాస్ తరపు న్యాయవాది శ్రావణ్ కుమార్, తెలంగాణ ఎఎజి రాంచందర్ రావు ధర్మాసనానికి తెలిపింది.
గవినోళ్ల శ్రీనివాస్ కేసు విచారణ సందర్భంగా ఎన్జీటి.. ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. డిపిఆర్ తయారు కోసం ప్రాజెక్టు పునాదులు తవ్వాలా అని బెంచ్ ప్రశ్నించింది. ట్రిబ్యునల్ తీర్పు అమలు కాకపోతే నిస్సహాయంగా మేం చూస్తూ ఉండాలా అని ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. కోర్టు తీర్పుల అమలు కోసం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని బెంచ్ అభిప్రాయపడింది. దీనిపై మంగళవారం విచారణ కొనసాగనుంది.