Inter Classes
Inter Classes : ఏపీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్ ఫస్టియర్ క్లాసులకు ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ ఫస్టియర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ విద్యామండలి 2021-22 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.
ఈ విద్యా సంవత్సరంలో 188 పని దినాలు ఉంటాయని.. రెండో శనివారాల్లో కూడా కాలేజీలు కొనసాగుతాయని ఇంటర్ బోర్డు తెలిపింది. అలాగే ఈసారి టర్మ్ సెలవులు ఉండవని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 2022 ఏప్రిల్ 23 వరకు కాలేజీలు కొనసాగనున్నాయి. అలాగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు 2022 మార్చి తొలి వారంలో నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 24-మే 31 వరకు సెలవులు ఉండనున్నాయి. మే చివరలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. అటు త్వరలో జరిగే ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్ష రుసుం చెల్లింపును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించింది ఇంటర్ బోర్డు. కాగా, 2022-23 విద్యా సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి మొదలు కానున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. కరోనా కారణంగా రాష్ట్రంలో ఏడాదికి పైగా విద్యాసంస్థలు(కాలేజీలు, స్కూళ్లు) మూతపడ్డాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విద్యాసంస్థలు తిరిగి తెరిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అగస్టు 16 నుంచి రాష్ట్రంలో స్కూళ్లు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంటర్ ఫస్టియర్ క్లాసుల నిర్వహణకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. పిల్లలు ఇప్పటికే బడి బాట పట్టగా, విద్యార్థులు కాలేజీ బాట పట్టనున్నారు.