Inter Results : ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ఆంధ్ర ప్రదేశ్‌లో గత నెల 15 నుంచి 23 మధ్య జరిగిన ఇంటర్ మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితారు శనివారం విడుదలయ్యాయి.

Inter Results

Inter Results : ఆంధ్ర ప్రదేశ్‌లో గత నెల 15 నుంచి 23 మధ్య జరిగిన ఇంటర్ మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల ఫలితారు శనివారం విడుదలయ్యాయి. ఇక ఫస్టియర్ పరీక్షలకు 3, 24,800 మంది విద్యార్థులు హాజరు కాగా, సెకండియర్ పరీక్షలకు 14,950 మంది విద్యార్థులు హాజరయ్యారు. రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కు ఈనెల 26 నుంచి నవంబర్ 2తేదీ వరకు అవకాశం కల్పించారు.

చదవండి : Inter Exams : ఇంటర్ పరీక్షలు రద్దు.. హైకోర్టు కీలక తీర్పు

రీకౌంటింగ్ కొరకు ఒక పేపర్‌కు రూ.260, రీ వెరిఫికేషన్‌కు పేపర్ కు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుంది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్లకు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రామక్రిష్ణ తెలిపారు. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్‌ను ‘[email protected]” ద్వారా లేదా 391282578 వాట్సాప్‌ నంబర్లకు సంప్రదించవచ్చని ఇంటర్ బోర్డ్‌ కార్యదర్శి తెలిపారు.

చదవండి : Telangana Inter : ఈ స్టడీ మెటీరియల్ చదివితే ఇంటర్ పాస్!