AP High Court
AP High Court: విశాఖపట్టణంలోని రుషికొండ తవ్వకాల వివాదంపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం న్యాయస్థానంలో ఇరుపక్షాల వాదనలు జరిగాయి. రుషికొండ తవ్వకాల్లో భాగంగా మూడు ఎకరాలు అదనంగా తవ్వకాలు జరిపామని ప్రభుత్వం అంగీకరించింది. అయితే మూడు కాదు 20ఎకరాలు అదనంగా తవ్వకాలు జరిపారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP High Court: గూగుల్ మ్యాప్‌లు అబద్దాలు చెబుతాయా? రిషికొండ అక్రమ తవ్వకాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
అనుమతికి మించి ఎంత మేర తవ్వకాలు జరిపారనే విషయంపై కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ బృందాలతో సర్వేకు రాష్ట్ర హైకోర్ట్ ఆదేశించింది. సర్వే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలుంటాయని హైకోర్టు తెలిపింది. అయితే, విచారణను ధర్మాసనం డిసెంబర్ 14కు వాయిదా వేసింది. గతనెల 13న టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుతో పాటు మరొకరు దాఖలు చేసిన పిటీషన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. రుషికొండపై గతంలో 9.2 ఎకరాల్లో తవ్వకాలు జరిపేందుకు అనుమతి ఇవ్వగా.. ప్రభుత్వం మాత్రం 20 ఎకరాలు తవ్వేసిందని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనికి సాక్ష్యంగా తాజా గూగుల్ మ్యాప్ లను సమర్పించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అటవీశాఖ దీనిపై కమిటీ నియమించేందుకు ఏపీ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రభుత్వ తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది.
AP High Court : మూడు నెలలు కాదు .. రెండు నెలల్లో రోడ్లు వేయాల్సిందే .. వీధి లైట్లు వెలగాల్సిందే
రుషికొండపై జరుపుతున్న తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం ఏదో దాస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రుషికొండ తవ్వకాలపై కేంద్రం కమిటీ వేస్తానంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్నిప్రశ్నించింది. అలాగే గూగుల్ మ్యాప్ లపై స్పందిస్తూ.. ఫొటోలు అబద్ధం చెబుతాయా అని హైకోర్టు నిలదీసింది. అయితే ప్రభుత్వ తరపు న్యాయవాది వివరణ ఇచ్చేదుకు గడువుకోరగా.. విచారణను న్యాయస్థానం నవంబర్ 3కు వాయిదా వేసింది. ఈరోజు విచారణ జరిపిన హైకోర్టు కేంద్ర అటవీ శాఖ, పర్యావరణ అధికారుల బృందాన్ని సర్వేకు ఆదేశించింది.