AP High Court : మూడు నెలలు కాదు .. రెండు నెలల్లో రోడ్లు వేయాల్సిందే .. వీధి లైట్లు వెలగాల్సిందే

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. హైకోర్టుకు వెళ్లే రహదారి సరిగా లేదని..కనీసం వీధి లైట్లు కూడా వెలగటంలేదని దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం రెండు నెలల్లోగా రోడ్లు నిర్మంచాల్సిందే..లైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వానికి ఆదేశించింది.

AP High Court : మూడు నెలలు కాదు .. రెండు నెలల్లో రోడ్లు వేయాల్సిందే .. వీధి లైట్లు వెలగాల్సిందే

ap high court order issues on roads and street lights.. (1)

AP High Court : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి మొట్టికాయలు వేసింది. హైకోర్టుకు వెళ్లే రహదారి సరిగా లేదని..కనీసం వీధి లైట్లు కూడా వెలగటంలేదని దాఖలైన పిటీషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం రెండు నెలల్లోగా పునరుద్ధరించాలని ఆదేశించింది. కానీ రెండు నెలల్లో పూర్తి కావని మూడు నెలలు గడువు ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. కానీ కోర్టు మాత్రం మూడు నెలలు కుదరదు రెండు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

కాగా హైకోర్టుకు వెళ్లే రహదారిలో వీధి లైట్లు , వెలగక, రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వీధి లైట్లు లేకపోవడంతో ఉద్యోగులు, న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై వాదనలు విన్న ధర్మాసనం.. ఉద్యోగులు, న్యాయవాదులు, ఇతరుల భద్రతా దృష్ట్యా 60 రోజుల్లోగా విద్యుత్‌ సరఫరా, రహదారి మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించింది. కానీ మరమ్మతులు చేసేందుకు 60 రోజులు సరిపోవని..కనీసం మూడు నెలలు గడువు కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది. రెండు నెలల్లో పూర్తి చేయాల్సిందేనని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించకపోతే ఎలా? దీనికి కూడా గడువు కావాలా? అని కోర్టు అసహనం వ్యక్తంచేసింది.