IPS Siddharth Kaushal Resign: ఏపీలో ఐపీఎస్ అధికారి సిద్ధార్ధ్ కౌశల్ రాజీనామా చేశారు. స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానన్న సిద్ధార్ధ్ ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం అన్నారు. తనపై ఎటువంటి ఒత్తిడి లేదన్నారాయన. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి, సహచరులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు సిద్ధార్ధ్ కౌశల్. రాబోయే రోజుల్లో సమాజానికి కొత్త మార్గాల్లో సేవలు అందిస్తానని లేఖ ద్వారా తెలిపారు.
ఒత్తిళ్లతో తాను రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు సిద్ధార్ధ్ కౌశల్. స్వచ్ఛందంగానే ఆ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇన్నేళ్లు ఆంధ్రప్రదేశ్ లో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సిద్ధార్ధ్ కౌశల్. సిద్ధార్ధ్ కౌశల్ 2012 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్.
Also Read: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు కుండపోత.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..
కౌశల్ కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల ఎస్పీగా పని చేశారు. ప్రస్తుతం ఏపీ డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా పని చేస్తున్నారు. ఇటీవలే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఒత్తిళ్లతోనే రాజీనామా చేశారని ప్రచారం జరుగుతుండటంతో ఓ ప్రకటన ద్వారా క్లారిటీ ఇచ్చారు కౌశల్. రాజీనామా నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత కారణాలు, కుటుంబ సభ్యుల అభిప్రాయాల తర్వాత తీసుకుందని స్పష్టం చేశారు. రాజీనామాకు ఒత్తిళ్లు, వేధింపులే కారణమంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.