Pithapuram: సేనాని అక్కడ ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే. ఇప్పుడదే ఆయనకే ఇలాకా అయిపోయింది. పవన్ ఫ్యాన్స్‌కు తాలూకా అయిపోయింది. ఏపీలో పవన్‌కి సొంత నియోజకవర్గం ఏది అంటే..ఆయనకు కూడా క్వశ్చన్ మార్క్‌గా ఉండేది. తనకంటూ ఒక సొంత నియోజకవర్గం ఉండాలన్న ఆలోచన కూడా లేదని చెప్పుకొచ్చేవారు.
అయితే ఇప్పుడు పవన్ కేరాఫ్ పిఠాపురం అయిపోయింది. ఆయనకంటూ ఒక సొంత నియోజకవర్గం ఏర్పడింది. పవన్ కూడా తన మంత్రిత్వ శాఖలలో ఏ కొత్త నిర్ణయం తీసుకున్న పిఠాపురం నుంచే ప్రారంభిస్తున్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందేనన్న టాక్ మొదలైంది. ఇక, ఎప్పటికీ ఇక్కడ వైసీపీ గెలిచే ఛాన్స్ ఉండదనే చర్చ జరుగుతోంది. పొలిటికల్ కంటే కూడా..పిఠాపురం ప్రజలకు మరింత దగ్గరవుతూ వస్తున్నారు పవన్. (Pithapuram)
ఎంత బిజీగా ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. పిఠాపురం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆయన..ఏ చిన్న సమస్య వచ్చినా సాల్వ్ చేస్తున్నారు. ఉప్పాడ మత్య్సకారుల సమస్యపై ఇమిడీయేట్‌గా రియాక్ట్ అయి వెంటనే..క్షేత్రస్థాయిలో పర్యటించి మీ సమస్యను పరిష్కరించే బాధ్యత తనదంటూ మాటిచ్చారు. అంతేకాదు స్థానిక ప్రజలను ఆత్మీయంగా చేరదీస్తూ..ఎమోషనల్‌గా జనాలతో అటాచ్‌మెంట్ పెంచుకుంటున్నారు.
Also Read: లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ బలం ఎంత? బీఆర్ఎస్‌ను వెనక్కి నెట్టి సెకండ్ ప్లేస్‌లో నిలిచేలా గేమ్..
ఇలా పవన్ వేస్తున్న వ్యూహం ముందు వైసీపీ తేలిపోతోందట. నేనున్నానంటూ కష్ట, సుఖాలు తెలుసుకుంటూ ప్రజలకు చేరువ అవుతున్నారు. ఏ శుభకార్యం జరిగినా..అన్నగా..ఇంటి పెద్దగా అన్నీ తానై నడుచుకుంటున్నారు. పిఠాపురం మహిళలకు చీరలు పెడుతున్నారు. వ్రతాలు, నోములు వంటివి సామూహికంగా చేయిస్తున్నారు. ఇలా..పిఠాపురం ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు పవన్. ఇక స్థానిక యువత.. సినీ గ్లామర్‌ను వదులుకునేందుకు ఇష్టపడట్లేదట. రైతులు, ఇతర సాధారణ ప్రజలు కూడా పవన్‌కు మంచి మార్కులే వేస్తున్నారట. దీంతో సేనానికి తిరుగులేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.
వచ్చే ఏడాది నుంచి విడిదిగా మార్చుకుని.. ప్రతి నెల..
పిఠాపురం పవన్ అడ్డాగా మారిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. పైగా ఇక్కడే ఆయన ఇల్లు కట్టుకుంటున్నారు. వచ్చే ఏడాది నుంచి విడిదిగా మార్చుకుని ప్రతి నెలా కనీసం రెండు నుంచి మూడ్రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. దీంతో స్థానికులతో మరింత బంధం పెంచుకునేలా పవన్ అడుగులు వేస్తున్నట్టు అయింది. పవన్ అంతలా పిఠాపురం పీఠాన్ని పర్మినెంట్ చేసుకునే పనిలో బిజీగా ఉంటే..ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పరిస్థితి ఏంటన్న డిస్కషన్ మొదలైంది.
పిఠాపురంలో వైసీపీ తరఫున గళం వినిపించే నాయకులే లేరట. గత ఎన్నికల్లో పోటీ చేసిన వంగా గీత కాకినాడకు పరిమితమయ్యారని అంటున్నారు. ఓడిపోయిన మొదట్లో కూడా ఆమె అప్పుడప్పుడు పిఠాపురంకు వచ్చి పార్టీ యాక్టివిటీలో పాల్గొనడంతో పాటు..నేతలను కలుస్తూ ఉండేవారు. ఈ మధ్య కాలంలో వంగా గీత పిఠాపురంకు రావట్లేదని అంటున్నారు. ఇక పెండెం దొరబాబు పార్టీ మారి..జనసేన కండువా కప్పుకొన్నారు.
క్యాడర్ పరంగా కూడా పిఠాపురంలో వైసీపీ వీక్ అయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న కాపులు..వైసీపీని దూరమయ్యారని పెట్టి..జనసేనను అడాప్ట్ చేసుకున్నారన్న చర్చ జరుగుతోంది. ఎలా చూసుకున్నా..పిఠాపురంలో తిరిగి సత్తా చాటడం అంతా ఈజీ కాదన్న ఒపీనియన్సే వ్యక్తం అవుతున్నాయి. రాబోయే రోజుల్లో వైసీపీ ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో..పవన్ తన ఇలాకాను నిలబెట్టుకునేందుకు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో చూడాలి మరి.