వైసీపీ కార్యాలయం కూల్చివేతపై స్పందించిన జగన్ .. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు

తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని సీఆర్డీయే అధికారులు శనివారం ఉదయం కూల్చివేశారు.

YSRCP Office Demolition at Tadepalli : తాడేపల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయ భవనాన్ని సీఆర్డీయే అధికారులు శనివారం ఉదయం కూల్చివేశారు. తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ప్రొక్లెయినర్లు, బుల్డోజర్లతో భవనాన్ని కూల్చివేసే ప్రక్రియను మొదలు కాగా.. ఉదయం 9గంటల వరకు పూర్తిచేశారు. దీంతో సీఆర్డీయే అధికారులతీరుపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. హైకోర్టు ఆదేశాలుసైతం బేఖాతరు చేసి.. కోర్టు ధిక్కరణకు ప్రభుత్వం పాల్పడుతుందని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా ఈ విషయంపై వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు.

Also Read : వైసీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డికి బిగ్ షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం

జగన్ ట్వీట్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్నిపారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏవిధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజలకోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను. అంటూ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read : రుషికొండ అద్భుత రాజప్రాసాదాలను చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయబోతోంది..?

వైసీపీ కార్యాలయ భవనం కూల్చివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. సూపర్ 6 అమలు కన్నా వైసీపీ ఆఫీసు కూల్చడమే ముఖ్యమని భావిస్తున్న చంద్రబాబు ప్రజాస్వామ్యవాదా? విధ్వంసకారుడా?అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు