YS Jagan: గుంటూరు, కర్నూలు జిల్లాల్లో జగన్ పర్యటన.. ఏయే ప్రోగ్రాముల్లో పాల్గొంటారంటే?

జగన్ గురువారం ఉదయం 7.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకుంటారు

YS Jagan – Guntur: ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని గుంటూరు జిల్లా (Guntur) మంగళగిరి.. అలాగే కర్నూలు జిల్లా(Kurnool)లో సీఎం జగన్ గురువారం పర్యటించనున్నారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న వైసీపీ నాయకుడు పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి (Pernati Shyam Prasad Reddy) సోదరుడి కుమారుడు కౌశిక్‌ వివాహానికి జగన్ హాజరుకానున్నారు.

అనంతరం కర్నూలు జిల్లా పత్తికొండలో వరుసగా 5వ ఏడాది మొదటి విడతగా వైస్సార్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

షెడ్యూలు ఇలా..
జగన్ గురువారం ఉదయం 7.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా మంగళగిరి చేరుకుంటారు.
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరగనున్న పేర్నాటి శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి సోదరుడి కుమారుడు కౌశిక్‌ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు.
అనంతరం అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. కర్నూలు జిల్లాకు బయలుదేరుతారు.

కర్నూలు జిల్లా పత్తికొండలోని సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభా వేదికకు చేరుకుంటారు.
అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగించిన అనంతరం వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు.
సభ అనంతరం మధ్యాహ్నం సీఎం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Kesineni Nani : ఎంపీ టికెట్ ఏ పిట్టల దొరకు ఇచ్చినా అభ్యంతరం లేదు.. ప్రజలు కోరుకుంటే ఇండిపెండెంట్ గా గెలుస్తానేమో : కేశినేని నాని

ట్రెండింగ్ వార్తలు