జగనన్న చేదోడు పథకం : వారి అకౌంట్లో రూ. 10వేలు

  • Publish Date - June 10, 2020 / 01:25 AM IST

ఏపీలో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న… సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనక్కి తగ్గడం లేదు సీఎం జగన్‌.. పథకాల కొనసాగింపులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. లాక్‌డౌన్‌తో కుల వృత్తి కోల్పోయిన..ప్రతీ కుంటుంబాన్ని ఆదుకునేందుకు సరికొత్త పథకం ప్రవేశ పేట్టేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సంక్షేమ పథకాలలో భాగంగా 2020, జూన్ 10వ తేదీ బుధవారం జగనన్నచేదోడు పథకం ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వెనుకబడిన వర్గాల్లో కుల వృత్తులపై ఆధారడిపడి జీవనం సాగిస్తోన్న వారందరికి ఈ చేదోడు పథకం ఆసరా నిలుస్తుంది. సీఎం క్యాంప్‌ ఆఫీస్ లో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు. షాపులున్న రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్లులకు ఏడాదికి రూ 10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయనుంది. ఈ పథకంలో భాగంగా 2 లక్షల, 47 వేల 40 మంది లబ్దిదారులకు ఆదుకునేందుకు 247 కోట్ల 40 లక్షలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చేదోడు పథకం కింద అర్హులైన లబ్దిదారుల జాబితాను నెలాఖరున దశల వారికి అధికారులు ప్రకటిస్తారు. ఈ జాబితాను గ్రామ – వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉండబోతుంది. అర్హులైన వారందరికి ఈ డబ్బును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేయనున్నారు. పాత అప్పులకు జమ చేసుకోలేని విధంగా ముందుగానే బ్యాంక్‌లతో మాట్లాడి లబ్దిదారుల ఆన్‌ ఇన్‌ కంబర్డ్‌ అకౌంట్లకు ఈ నగదు జమ చేసేలా ఏపీ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది.

Read: కరోనా..ప్రమాదకర రాష్ట్రాల జాబితాలో చేరిన ఏపీ