×
Ad

పార్టీని వీడి వెళ్లిన నేతలకు వైసీపీ అధినేత బంపర్ ఆఫర్..! జగన్ ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చినప్పటికీ..

ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు ఉండగానే ఇప్పటినుంచే క్యాడర్, లీడర్లను మెయింటెన్‌ చేయడం..ఆర్థికంగా భారమని భావిస్తున్నారట.

YSRCP: ఓటమి వైసీపీని షాక్‌కు గురి చేసింది. అధినేత నుంచి కార్యకర్త వరకు అందరూ డైలమాలో ఉండిపోయారు. కూటమి దూకుడు..వైసీపీ నేతల వరుస అరెస్టులు..ఆ తర్వాత లిక్కర్ కేసు ఇలా వరుస పరిణామాలు ఫ్యాన్‌ స్పీడును ఇంకా తగ్గించాయి. ఈ క్రమంలో చాలామంది నేతలు ఫ్యాన్ స్విచ్చాప్ చేసి అయితే సైకిల్ ఎక్కారు. లేకపోతే జనసేనలోకి వెళ్లారు. కొందరు కాషాయం కండువా కప్పుకున్నారు. ఇంకొందరు ఏ పార్టీకి వెళ్లకుండా వైసీపీకి గుడ్‌బై చెప్పి సైలెంట్‌గా ఉండిపోయారు.

అయితే పార్టీని వీడి వెళ్లిన నేతలంతా పేరున్న వాళ్లు కావడంతో పాటు తమతమ నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు కూడా. ఈ విషయాలను గమనించిన వైసీపీ అధినేత..ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల స‌మావేశంలో కీలక కామెంట్స్ చేశారు. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన వారిని తిరిగి చేర్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు జ‌గ‌న్. ఎవ‌రు వ‌చ్చినా డోర్లు తెరిచే ఉంటాయన్నారు. కొన్ని కార‌ణాల‌తో వెళ్లిపోయినా.. తిరిగి వ‌చ్చేవారికి త‌లుపులు తెరిచి ఉంచామ‌ని రెడ్‌ కార్పెట్‌ వెల్‌కమ్‌ చెప్పారు. (YSRCP)

Also Read: తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్.. ఇక బీ కేర్‌ ఫుల్.. అక్కడ దుకాణాలన్నీ మూసివేత

వైసీపీ అధినేత జగన్‌ రిటర్న్ బ్యాక్ అంటూ లీడర్లకు పిలుపునిచ్చి రెండు నెలలు అవుతోంది. అయినా ఇప్పటివరకు పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలెవరు తిరిగి ఫ్యాన్ పార్టీ వైపు చూడలేదు. ఇలా ఎందుకు జ‌రిగిందనేది చర్చకు దారితీస్తోంది. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌..చాలా మంది కీల‌క నాయ‌కులు.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. జగన్ దూర‌పు బంధువు బాలినేనిశ్రీనివాస‌రెడ్డి, రైట్ హ్యాండ్‌గా పేరున్న విజ‌య‌సాయిరెడ్డి, ఆళ్లనాని, మోపిదేవి వెంకటరమణతో పాటు జిల్లాల స్థాయిలోనూ చాలా మంది నేతలు ఉన్నారు.

అక్కడ గుర్తింపు దక్కట్లేదట..

వీరంతా కూడా ..వైసీపీని కాద‌ని వెళ్లిపోయారు. ప‌ద‌వుల్లో ఉన్నవారు కూడా వేర్వేరు పార్టీల్లో చేరిపోయారు. అయితే వైసీపీని వీడి కూటమి పార్టీల్లో చేరిన నేతలకు అక్కడ గుర్తింపు దక్కట్లేదట. వాళ్లను ఆ పార్టీల్లో ఎవరూ నమ్మట్లేదట. దీంతో వైసీపీని వ‌దిలేసి బాధ‌ప‌డుతున్నట్టు లీకులు ఇస్తున్నార‌ట‌. ఈ విషయం జగన్ చెవిన పడటంతో తిరిగి పార్టీలోకి రావొచ్చు..ఆల్ ఆర్ వెల్‌ కమ్‌ అని చెప్పారు జగన్. కానీ నాయ‌కులు ఎవ‌రూ మ‌ళ్లీ వైసీపీలోకి చేర‌లేదు.

కొందరు నాయకులు తమకు వైసీపీనే ఆప్షన్‌..తిరిగి ఫ్యాన్ పార్టీలోకి వెళ్తామంటూనే..కాస్త టైమ్‌ తీసుకుంటున్నారట. ఇప్పుడే వైసీపీలోకి వెళ్తే..ఏ కారణంతోనైతే పార్టీని వీడివాళ్లారే..అదే కష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుందని టెన్షన్ పడుతున్నారట. ఇప్పటికప్పుడు తిరిగి వైసీపీలోకి వెళ్లినా..మళ్లీ కూటమికి టార్గెట్ అవుతామని ఆందోళన చెందుతున్నారట. అందుకే ఇంకొంత కాలం వెయిట్ చేసి..పరిస్థితిని బట్టి..టికెట్లు, నియోజకవర్గాలు, పొలిటికల్ సిచ్యువేషన్స్, సమీకరణాలన్నీ లెక్కలు వేసుకుని..ఎన్నికల మూమెంట్‌ హీటెక్కే టైమ్‌కు తిరిగి ఫ్యాన్ పార్టీలో చేరాలనేది కొందరు ప్లాన్ అంటున్నారు.

ఇప్పుడే వైసీపీలోకి వెళ్తే అటు కూటమి నుంచి ఒత్తిళ్లతో పాటు..ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు ఉండగానే ఇప్పటినుంచే క్యాడర్, లీడర్లను మెయింటెన్‌ చేయడం..ఆర్థికంగా భారమని భావిస్తున్నారట. అందుకే అదును చూసి ఇప్పుడున్న పార్టీలోనే ఉండాలా.? లేక ఇంకేదైనా ఆప్షన్ వెతుక్కోవాలా అనేది ఆలోచిస్తున్నారట. వైసీపీ విపక్షంలో ఉంది కాబట్టి ఎలాగూ అవకాశాలు ఉండే ఉంటాయని. అందుకే జగన్‌ ఇచ్చిన పిలుపునకు లీడర్లు క్విక్ రియాక్షన్‌ ఇవ్వట్లేదని చెప్పుకుంటున్నాయి ఫ్యాన్ పార్టీ వర్గాలు.