మాయావతి ప్రధాని కావాలి.. బీఎస్పీతో పొత్తు ఉందన్న పవన్

రానున్న ఎన్నికల్లో ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో బీఎస్పీతో కలిసి పోటీచేయనున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో పవన్ సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికలపై వీరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. సమావేశం తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు. మాయావతికి తాము మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఈ దేశానికి ప్రధానిగా మాయావతిని చూడాలనుకుంటున్నామని.. అది తమ పార్టీ బలమైన అభిలాష అన్నారు. దేశానికి దళిత నేత ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. మాయావతి మార్గనిర్దేశకత్వం చాలా అవసరమన్నారు.
Read Also: తెలంగాణను వదలా : ఐదు పార్లమెంట్ సీట్లలో టీడీపీ పోటీ!

అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం అందరికీ అందాల్సిన అవసరముందన్నారు. ఏపీలో బీఎస్పీకి ఎన్నిస్థానాలు కేటాయించేది త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి మాట్లాడుతూ..పొత్తులపై ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలిపారు. ఏపీ,తెలంగాణలో జనసేనతో సీట్ల సర్దుబాటు దాదాపు ఫైనల్ అయినట్లు తెలిపారు.ఏపీలో వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు గతంలో పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాము బీఎస్పీతో కూడా కలిసి పోటీ చేయబోతున్నట్లు పవన్ ప్రకటించారు. ఏప్రిల్-11న మొదటి విడతలో ఏపీ,తెలంగాణ ఎన్నికలు జరుగనున్నాయి.మే-23న ఫలితాలు వెలువడనున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు