Jana sena Nadendla Manohar : రాష్ట్రం బాగుపడాలంటే వైసీపీని గద్దె దింపాల్సిందే-నాదెండ్ల మనోహర్

రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని అంతా అనుకున్నారు. జగన్ పై ఉన్న కేసులను కూడా ప్రజలు పక్కన పెట్టి 151 సీట్లు ఇచ్చారు. కానీ,(Jana sena Nadendla Manohar)

Jana sena Nadendla Manohar : జనసేన నేతలు అధికార వైసీసీని టార్గెట్ చేశారు. జగన్ ప్రభుత్వం పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రాష్ట్రం బాగుపడాలంటే కచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. జగన్ పాలన అధ్వాన్నంగా ఉందని, దౌర్జన్యాలు పెరిగాయని, అభివృద్ధి ఆగిపోయిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాదెండ్ల మనోహర్ వాపోయారు.

” జగన్ పాలనలో అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా కొలిక్కి రాకపోవటం చాలా దారుణం. క్షేత్రస్థాయిలో సమస్యలు చూస్తే చాలా బాధ కలుగుతుంది. బటన్లు నొక్కుతున్నాము అని ప్రకటనలకు, ఆర్భాటాలకు పోతున్నారు.(Jana sena Nadendla Manohar)

Andhra pradesh : ఏపీలో రౌడీ రాజ్యం..హత్యలు చేయమని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు : బుద్దా వెంకన్న

సంక్షేమం కోసం వేల కోట్ల అప్పులు చేస్తున్నామని చెప్పటం ఏమిటి? మరి ఆ డబ్బు మొత్తం ఏమవుతోంది? వృద్ధుల పెన్షన్లు పనిగట్టుకుని తీసివేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. రోడ్ల మరమ్మతులు ఇంతవరకు జరగలేదు. మళ్ళీ వర్షా కాలం వస్తుంది. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. గతంలో జగన్ రూ.2వేల కోట్లతో రోడ్ల మరమ్మతులు చేస్తామన్నారు. ఎక్కడన్నా ఒక్క తట్టి మట్టి అన్నా వేసిన దాఖలాలు రాష్ట్రంలో ఉన్నాయా?

NagaBabu: మీ అధికారం ఐదేళ్లే జగన్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వంపై నాగబాబు

గడప గడపలో ప్రజలు ఎక్కడన్నా మాట్లాడతారేమోనని ముందుగానే ఎవరూ మాట్లాడకుండా వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు. వైసీపీ నాయకులు కొంతమందిపై దాడులు చేస్తే మీకు ఏం వస్తుంది? మూడేళ్లు అవుతున్నా అభివృద్ధి ఎక్కడ..? పక్క రాష్ట్రాలు ముందుకు వెళ్తుంటే మనం మాత్రం రోజు రోజుకు వెనక్కి వెళ్తున్నాము. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 132 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గం పులివెందులలోనే 13 మంది రైతులు చనిపోయారు. ఇది బాధాకరం.(Jana sena Nadendla Manohar)

ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఏ పార్టీ విజయం సాధిస్తుంది? అన్నది కాదు. అంతిమంగా ప్రజలకు మేలు జరగాలి. రాష్ట్రం బాగుపడాలంటే కచ్చితంగా వైసీపీని అధికారంలో నుంచి దింపాల్సిందే. ప్రభుత్వ పనితీరు ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. రాష్ట్రంలో మంచి పరిపాలన ఎక్కడా లేదు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎవరూ ఊహించనంతగా ఇసుక దోచుకోవటం జరుగుతుంది. ఇది చాలా బాధాకరం.

Pawan Kalyan Three Options : 3 ఆప్షన్లతో ముందుకొచ్చిన పవన్.. పొత్తులు, సీఎం అభ్యర్థిపై జనసేనాని హాట్ కామెంట్స్

జగనన్న కాలనీలు చూశా. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు కడుతున్న పనులు కూడా నాసిరకంగా జరుగుతున్నాయి. రాజకీయంగా ఆలోచన కాకుండా మంచి స్ఫూర్తితో అందరూ కలిసి పని చేసి కచ్చితంగా వైసీపీని గద్దె దించాలి. రాజశేఖర్ రెడ్డి తనయుడిగా జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని అంతా అనుకున్నారు. జగన్ పై ఉన్న కేసులను కూడా ప్రజలు పక్కన పెట్టి 151 సీట్లు ఇచ్చారు. కానీ, జగన్ మాత్రం దౌర్జన్యాలకు, దాడులకు తెగబడుతున్నారు. ఇబ్బందులు పెట్టి, కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇది ఎక్కువ రోజులు కొనసాగదు. ప్రజలు జగన్ ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.(Jana sena Nadendla Manohar)

ట్రెండింగ్ వార్తలు