NagaBabu: మీ అధికారం ఐదేళ్లే జగన్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వంపై నాగబాబు

ఏపీలో సినిమా టికెట్ల వివాదం కాస్త ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ VS ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా ప్రతిపక్షాలు.. పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న సంగతి..

NagaBabu: మీ అధికారం ఐదేళ్లే జగన్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వంపై నాగబాబు

Nagababu

NagaBabu: ఏపీలో సినిమా టికెట్ల వివాదం కాస్త ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ VS ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా ప్రతిపక్షాలు.. పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బెనిఫిట్ షో రద్దు.. సినిమా టికెట్ల ధరల తగ్గింపుతో అమ్మకాలు జరపాలని జీవోలు ఇవ్వడం.. బెనిఫిట్ షో వేసిన థియేటర్లపై అధికారుల దాడులు ఇలా అన్ని కలిసి పలుచోట్ల థియేటర్లు మూసివేశారు. దీనిపై పలువురు సెలబ్రిటీలు.. రాజకీయ నేతలు స్పందించి వారి అభిప్రాయాలూ తెలిపారు.

Bheemla Nayak : తెలుగు సినిమాని ఇక ఏ ఫోర్స్ ఆపలేదు.. ‘భీమ్లా నాయక్’పై దేవాకట్టా వ్యాఖ్యలు..

కాగా.. ఇదే అంశంపై మెగా బ్రదర్ నాగబాబు కూడా స్పందించారు. పేస్ బుక్ వీడియో ద్వారా దీనిపై స్పందించిన నాగబాబు.. ఏపీ ప్రభుత్వం, వైస్ జగన్ పవన్ కళ్యాణ్ పై పగ పట్టారని విమర్శించారు. సాయిధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కోపం ఉంటే నా మీద చూపించు అన్నందుకే సీఎం జగన్ పగబట్టి ఇలా సినిమాల విడుదల విషయంలో వేధిస్తున్నాడని అభిప్రాయపడిన నాగబాబు.. జగన్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీతో పాటు పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యారని అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

Bheemla Nayak: ఆయన నీతులన్నీ.. మాటలవరకే..!

ఏపీ ప్రభుత్వ విధానంపై సినీ ఇండస్ట్రీ నుండి కూడా ఒకరిద్దరు మినహా ఎవరు ఏం మాట్లాడడం లేదన్న నాగబాబు.. సినిమా రిలీజ్ కి అనేక ఇబ్బందులు సృష్టిస్తే సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఎవరు దైర్యంగా ముందుకు రావటం లేదని.. ప్రశ్నిస్తే చంపుతారా.. లేకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అంటూ ప్రశ్నించారు. మీ ప్రభుత్వం ఉండేది ఐదు సంవత్సరాలు మాత్రమేనని జగన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని.. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.

Bheemla Nayak: వ్యవస్థలకు అనుగుణంగా నడుచుకోవాలన్న మంత్రి..!

ఉత్తర కొరియా మాదిరి మన దేశంలో నియంతలా పాలించే అవకాశం లేదని.. డెమోక్రసీలో ఐదేళ్లు మాత్రమే అధికారం ఉంటుందని.. ఐదేళ్లలో మీరు ఏ తప్పులు చేసినా ఆ తర్వాత మళ్ళీ ప్రజల ముందుకే వెళ్లాలని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇక, సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టిస్తే కళ్యాణ్ బాబుకు వచ్చే నష్టమేమీ లేదని.. సినిమా నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలకు నష్టం వస్తుందని గుర్తు పెట్టుకోవాలని.. అదృష్టవశాత్తు భీమ్లా నాయక్ సినిమా సూపర్ హిట్టయిందని.. ప్రేక్షకులు ఔట్ ఆఫ్ ది వే సినిమాను ఆదరించారని లేకపోతే నిర్మాతలు నష్టపోయే వాళ్ళని నాగబాబు మాట్లాడారు.