Pawan kalyan Varahi : ఏపీలో పవన్ కల్యాణ్ ‘వారాహి’యాత్ర షురూ .. మళ్లీ జనాల్లోకి జనసేనాని

జనసేనాని పవన్ కల్యాణ్ ‘వారాహి’యాత్ర ప్రారంభం కానుంది. ఇక ‘వారాహి’యాత్ర ఏపీలో షురూకానుంది.

Pawan kalyan Varahi : జనసేనాని పవన్ కల్యాణ్ ‘వారాహి’యాత్ర ప్రారంభం కానుంది. జన సైనికులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆ తరుణం రానే వచ్చింది. ఇక ‘వారాహి’యాత్ర షురూకానుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్వయంగా వెల్లడించారు. దీంతో జనసైనికుల్లో జోష్ వచ్చేసింది. వారాహి కోసం దానిపై వచ్చే జనసేనాని కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక జనసేనా ‘వారాహి’పై జనంలోనే తిరుగుత మరోసారి ఏపీలో రాజకీయాల్లో హాట్ టాపిక్ కానున్నారు.

 

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో గోదావరి జిల్లాల నేతలతో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టే వారాహి యాత్ర పై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..జూన్ రెండవ వారంలో వారాహి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. వారాహి యాత్రకు సంబంధించిన నాదెండ్ల మనోహర్ 5 గంటలకి ప్రకటించనున్నారు.

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం వారాహిని ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. వారాహి వాహనం రంగు పెను సంచలనమైన విషయం తెలిసిందే. వారాహి వాహనం పెద్ద టాపిక్ గా మారింది. మరి ముఖ్యంగా వారాహి వాహనం రంగుపై వివాదం కూడా వచ్చింది. ఆర్మీ వాహనాలకు ఉపయోగించే ఆలివ్ గ్రీన్‌‌ రంగును పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి వినియోగించారంటూ విమర్శలు వచ్చాయి. కానీ అది నిబంధనలకు అనుగుణంగానే ఉందని తెలంగాణ రోడ్డు ట్రాన్స్ పోర్టు అధికారులు స్పష్టం చేశారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారంగానే ఉందని వివరించారు.కాగా వారాహి వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ TS 13 EX 8384.

 

కాగా.. ‘ఎన్నికల యుద్ధానికి వారాహి సిద్ధం’ అంటూ పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేయటంతో సంచలనంగా మారింది. వారాహికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో తెగ వైరల్ అయ్యాయి. తన ఎన్నికల ప్రచార పర్యటనల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనం వారాహి వీడియోను విడుదల చేశారు. వారాహికి తొలిసారిగా కొండ గట్ట ఆంజనేయస్వామి సన్నిధిలో పవన్ కల్యాణ్ పూజలు చేయించారు. ఆ తరువాత విజయవాడ వచ్చి దుర్గమ్మ సన్నిధిలోను ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా దుర్మమ్మకు పవన్ కల్యాణ్ చీర, సారె సమర్పించారు.

 

వారాహికి తొలిసారిగా కొండ గట్ట ఆంజనేయస్వామి సన్నిధిలో పవన్ కల్యాణ్ పూజలు చేయించారు. ఆ తరువాత విజయవాడ వచ్చి దుర్గమ్మ సన్నిధిలోను ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా దుర్మమ్మకు పవన్ కల్యాణ్ చీర, సారె సమర్పించారు. ఆ తరువాత వారాహి వాహనాన్ని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఉంచారు. ఈ క్రమంలో ఇక పవన్ కల్యాణ్ వారాహిపై జనాల్లోకి రానున్నారు. దీంతో జనసైనికులు ఫుల్ జోష్ లో ఉన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు