Pawan Kalyan (Google)
Pawan Kalyan – Volunteer System : వాలంటీర్ వ్యవస్థ టార్గెట్ గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెలరేగిపోతున్నారు. ఇటీవల వారాహి సభలో వాలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. అయినా పవన్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. వాలంటీర్లు, వాలంటీర్ వ్యవస్థపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. అంతేకాదు, వరుసగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి వాలంటీర్ సిస్టమ్ పై జనసేనాని హాట్ కామెంట్స్ చేశారు.
అసలు వాలంటీర్ వ్యవస్థ అవసరమే లేదన్నారు జనసేనాని పవన్ కల్యాణ్. వాలంటీర్లకు మన పర్సనల్ సమాచారాన్ని ఎందుకివ్వాలి? అని పవన్ నిలదీశారు. వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు ప్రజలకు సేవలు అందలేదా? అని అడిగారాయన. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారు అని ఏపీ సర్కార్ పై ధ్వజమెత్తారు.
తణుకు నియోజకవర్గం జనసేన ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు పవన్ కల్యాణ్. ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారాయన. రాజకీయ పార్టీని నడపడం అంత ఆషామాషీ కాదన్నారు పవన్. బలమైన సంకల్పం ఉండాలని చెప్పారు. జనసేనకు బలమైన, ధృడమైన సంకల్పం ఉందన్నారు.
Also Read: అంతుబట్టని అశోక్ గజపతిరాజు అంతరంగం.. ఇంతకీ ఆయన మనసులో ఏముంది?
”ప్రతి ఒక్కరు సమాజం పట్ల అవగాహన కలిగుండాలి. IAS, IPS లు జగన్ లాంటి క్రిమినల్ ముఖ్యమంత్రికి సెల్యూట్ చేయడం బాధగా ఉంది. మా అమ్మ, నాన్నకు నేను ఎస్ఐ కావాలని కోరిక ఉండేది. వారి కోరికను భీమ్లా నాయక్ సినిమాలో తీర్చాను. కానీ, నిజ జీవితంలో నేరవేర్చలేకపోయాను. అందరూ ప్రాథమిక హక్కులు తెలుసుకోవాలి. బ్రిటీష్ వారు వ్యాపారం కోసం మన దేశానికి వచ్చి మన దేశాన్నే పాలించారు. సీఎం జగన్ ఆ బ్రిటీష్ వారి కంటే డేంజర్ . సీఎం జగన్.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ అసలు అవసరమే లేదు. 164 రూపాయలు ఇచ్చి యువతను, వారిలోని శక్తిని నాశనం చేస్తున్నారు జగన్. వాలంటీర్లలోని టాలెంట్, స్కిల్స్ ని సద్వినియోగం చేసుకోవాలి” అని పవన్ కల్యాణ్ సూచించారు.
Also Read: నాపై దెబ్బ పడినట్లే లెక్క.. ఇక శ్రీకాళహస్తి వస్తా అక్కడే తేల్చుకుంటా: పవన్ కల్యాణ్