Ashok Gajapathi Raju: అంతుబట్టని అశోక్ గజపతిరాజు అంతరంగం.. ఇంతకీ ఆయన మనసులో ఏముంది?

ఇటీవల కాలంలో అశోక్ గజపతిరాజు మాటలతో టీడీపీలో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు అశోక్.

Ashok Gajapathi Raju: అంతుబట్టని అశోక్ గజపతిరాజు అంతరంగం.. ఇంతకీ ఆయన మనసులో ఏముంది?

Pusapati Ashok Gajapathi Raju

Pusapati Ashok Gajapathi Raju: టీడీపీ సీనియర్ నేత.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? పోటీ చేస్తే మళ్లీ ఎంపీగానా.. ఎమ్మెల్యేగానా..? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారుతోంది. ఎందుకంటే టీడీపీలో అశోక్ రోల్ అలాంటిది.. విజయనగరం వరకు అశోకే హైకమాండ్.. అందుకే ఆయన మనసులో ఏముందో.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీచేస్తారో ఎవరికీ అంతుబట్టడం లేదు.. సామాన్య కార్యకర్తలకే కాదు.. టీడీపీ అధిష్టానం కూడా ఇదే కన్ఫ్యూజన్‌లో ఉందంటున్నారు. ఇంతకీ అశోక్ మనసులో ఏముంది?

విజయనగరం సంస్థానాదీసుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఏది మాట్లాడినా సెన్సేషనే. ఆయన ఆడిన ప్రతి మాటకూ అర్థం, పరమార్థం ఉంటుంది. ప్రతిపదం, వాఖ్యం వెనుక రాజకీయం.. లోతైన వ్యూహం ఉంటుంది. ఇటీవల కాలంలో అశోక్ మాటలతో టీడీపీలో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు అశోక్.

విన్నారుగా.. అశోక్ ఏమన్నారో.. ‘తాను పోటీ చేస్తానా, కాదా అన్నది అనవసరం…. టీడీపీని గెలిపించాలి…!” అంటూ అశోక్ చేసిన వ్యాఖ్యలు పార్టీలోనే కాదు ప్రత్యర్థులనూ కన్ఫ్యూజన్‌లో పడేశాయి. అశోక్ యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు కావు అవి. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొనే అలా మాట్లాడరని చెబుతున్నారు. తాను ముఖ్యం కాదు… పార్టీ ముఖ్యమంటూ అశోక్ మాట్లాడటం బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? లేదా? అన్న చర్చకు దారితీస్తోంది.

Also Read: పొద్దు పొద్దున్నే మాకేందుకీ రచ్చ.. వాలంటీర్ ఎవ్వరు? ఎలా వచ్చారు?.. పవన్‌పై బొత్స ఘాటు వ్యాఖ్యలు..

వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా అశోకగజపతిరాజు పేరు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అశోక్.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈజీగా గెలవచ్చని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. గత ఎన్నికల్లో అశోక్‌కు బదులుగా ఆయన కుమార్తెను అదితిని బరిలో దింపడంతో ఓడిపోయామని.. ఈ సారి అలాంటి రిస్క్ చేయకూడదని అనుకుంటోంది. కానీ, అశోక్ మాత్రం మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి విముఖంగా ఉన్నారని చెబుతున్నారు. కేంద్రమంత్రిగా పనిచేసిన తాను.. మళ్లీ అసెంబ్లీకి వెళ్లడం సరికాదని భావిస్తున్నారట అశోక్ గజపతి.

Also Read: ముద్రగడ పద్మనాభం మౌనం.. వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా..

టీడీపీలో అశోక్‌గజపతికి తిరుగులేదు. విజయనగరం జిల్లా వరకు ఆయనే హైకమాండ్.. ఎవరు ఎక్కడ పోటీ చేయాలో.. ఏం చేస్తే బాగుంటుందో… అంతా అశోక్ ఇష్టప్రకారమే నడుస్తుంది. అలాంటిది అశోక్ పోటీపై అంతా క్లారిటీగా ఉన్నారనుకుంటున్న సమయంలో.. వ్యక్తి ముఖ్యం కాదు.. పార్టీని గెలిపించండి అంటూ అశోక్ చేసిన వ్యాఖ్యలతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అశోక్ పోటీ నుంచి తప్పుకోవాలని భావిస్తే చాన్స్ కోసం ఎంతోమంది బీసీ నేతలు ఆసక్తిగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మళ్లీ అసెంబ్లీకి పోటీ చేయాలని కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లో తనకు కాకుండా అశోక్ కుమార్తకు టిక్కెట్ ఇవ్వడంపై గీత కినుక వహించారు. ఇప్పుడు అశోక్ వ్యాఖ్యలతో మళ్లీ రేసులోకొచ్చారు గీత. అలా అని అశోక్‌కు పోటీగా రాజకీయం నడిపే పరిస్థితీ లేదు. ఏదైనా అశోక్ నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తేనే ఏదైనా చేయడానికి.. తన భవిష్యత్ వ్యూహంపై అశోక్ క్లారిటీ ఇస్తేగాని.. ఈ సస్పెన్స్‌కు తెరపడదు.. అంతవరకు విజయనగరం రాజకీయంలో గందరగోళమే కొనసాగుతుందని అంటున్నారు.