Botsa Satyanarayana: పొద్దు పొద్దున్నే మాకేందుకీ రచ్చ.. వాలంటీర్ ఎవ్వరు? ఎలా వచ్చారు?.. పవన్‌పై బొత్స ఘాటు వ్యాఖ్యలు ..

పవన్ కళ్యాణ్ మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అతన్ని పట్టించుకోవద్దు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలకు సూచించారు. వాలంటిర్ ఎవరు? ఎలా వచ్చారు? వాలంటీర్ వీధి విధానాలు పవన్ కళ్యాణ్‌కు తెలుసా అని బొత్స ప్రశ్నించారు.

Botsa Satyanarayana: పొద్దు పొద్దున్నే మాకేందుకీ రచ్చ.. వాలంటీర్ ఎవ్వరు? ఎలా వచ్చారు?.. పవన్‌పై బొత్స ఘాటు వ్యాఖ్యలు ..

Botsa Satyanarayana

AP Minister Botsa: వాలంటీర్ వ్యవస్థ (volunteer system) పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని వాలంటీర్లు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. మరోవైపు వైసీపీ నేతలు పవన్ వ్యాఖ్యలుపై వరుస ప్రెస్‌మీట్లతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గాలి మాటలపై పొద్దుపొద్దున్నే మాకెందుకీ రచ్చ. అతని వ్యాఖ్యలపై ఎవ్వరూ పట్టించుకోకుంటేనే మంచిది అని బొత్స అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పుట్టిందో ముందు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి అంటూ సూచించారు.

BV Raghavulu: ఏపీలో వాలంటీర్ వ్యవస్థను నిందించడం కరెక్ట్ కాదు.. యూసీసీపై మూడు పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాలి

దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న వాలంటీర్ వ్యవస్థ పై దుర్బుద్ధి‌తో విషప్రచారం చేస్తున్నారు. బీజేపీ కూడా వాలంటీర్ వ్యవస్థపై ద్వంద వైఖరితో మాట్లాడుతున్నారు. వాలంటీర్ వ్యవస్థను ప్రధాని మోదీ మెచ్చుకుంటారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం విమర్శిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌కు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నాడంటూ బొత్స ప్రశ్నించారు. పవణ్ కళ్యాణ్ అయన పాట్నర్ మాత్రమే హైదరాబాద్లో ఉంటారు ప్రజల డేటాను హైదరాబాద్ ఉంచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదంటూ బొత్స ఎద్దేవా చేశారు. ఏ డేటా ఎక్కడ ఉంది పవన్ కళ్యాణ్‌కు తెలుసా..? ప్రజల డేటా ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కానీ, పవన్ కల్యాణ్ గాలి మాటలు మాట్లాడుతున్నారు అంటూ బొత్స విమర్శించారు.

Pawan Kalyan: వాలంటీర్లపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

పవన్ కళ్యాణ్ మాటలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అతన్ని పట్టించుకోవద్దు అంటూ బొత్స సత్యనారాయణ ప్రజలకు సూచించారు. వాలంటిర్ ఎవరు? ఎలా వచ్చారు? వాలంటీర్ వీధి విధానాలు పవన్ కళ్యాణ్‌కు తెలుసా అని బొత్స ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాలు వాలంటీర్ వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నాయి. కానీ, మన రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ బురద చల్లాలని చూస్తున్నారు అంటూ విమర్శించారు. ఏ నిఘా వర్గాలు సమాచారం ఇచ్చారో పవన్ కల్యాణ్ చెప్పాలి.. నిఘా వర్గాలు ఇచ్చినట్లు అధారాలు ఉంటే పవన్ కళ్యాణ్ చూపించాలని పవన్ కు బొత్స సూచించారు. విలేకరులు రఘురామకృషం రాజు గురించి ప్రస్తావించగా.. రఘురామ కృష్ణంరాజు యూజ్ లెస్ ఫెలో.. అతని యూజ్ లెస్ మాటలు అడగవద్దు అంటూ బొత్స వ్యాఖ్యానించారు.