Pawan Kalyan: వాలంటీర్లపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

వాలంటీర్ సురేష్ ఫిర్యాదు మేరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు సెక్షన్ 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేశారు.

Pawan Kalyan: వాలంటీర్లపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు

Case Registered on Pawan

Updated On : July 13, 2023 / 9:59 AM IST

Janasena Party Chief: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై కేసునమోదైంది. ఏలూరు లో నిర్వహించిన వారాహి యాత్ర (Varahi Yatra) లో వాలంటీర్లు (Volunteers)పై పవన్ చేసిన వ్యాఖ్యలకుగాను ఈ కేసు నమోదు చేశారు. వాలంటీర్ సురేష్ (Volunteer Suresh) ఫిర్యాదు మేరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు (Krishna Lanka Police) సెక్షన్ 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తి సచివాలయంలో పనిచేస్తున్న అయోధ్య నగర్‌కు చెందిన దిగమంటి సురేష్ బాబు.

Pawan Kalyan : ఇంట్లోకి దూరే అవకాశం ఇచ్చారు.. వాలంటీర్లపై మరోసారి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

సెక్షన్ 153 ప్రకారం.. పవన్ కళ్యాణ్ మాటల మూలంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని కేసు నమోదు చేశారు. అదేవిధంగా 153 A కింద రెండు మతాలు, రెండు కులాల మధ్య విద్వేషాలుకు అవకాశం వుందంటూ కేసు నమోదు చేశారు. మరో సెక్షన్. 505(2) కింద తాను చెబుతున్నది రూమర్ అని తెలిసినా, కావాలని చెప్పడంతో గొడవలు జరిగే అవకాశం ఉందంటూ మరో సెక్షన్ కింద పోలీసులు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు. మొత్తం మూడు సెక్షన్ల కింద కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు.