Guntur Stampede : గుంటూరు తొక్కిసలాట ఘటనపై పవన్, సోమువీర్రాజు రియాక్షన్

గుంటూరు తొక్కిసలాట ఘటనపై సోమువీర్రాజు, పవన్ స్పందించారు. ఇది ముమ్మాటికీ నిర్వాహకుల వైఫల్యమే అన్నారు సోము వీర్రాజు. కందుకూరు ఘటన మరువక ముందే ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారాయన. (Guntur Stampede)

Guntur Stampede : గుంటూరు తొక్కిసలాట ఘటనపై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు స్పందించారు. ఇది ముమ్మాటికీ నిర్వాహకుల వైఫల్యమే అన్నారాయన. కందుకూరు ఘటన మరువక ముందే ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారాయన.

అధికారమే పరమావధిగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సభలు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సోమువీర్రాజు హితవు పలికారు. ప్రతిపక్షంతో పాటు ప్రభుత్వం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సోమువీర్రాజు చెప్పారు. గుంటూరు ఘటనలో మృతుల కుటుంబాలకు సోమువీర్రాజు సానుభూతి తెలిపారు.

Also Read..Stampede In Guntur: చంద్రబాబు సభలో మరోసారి కలకలం… తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతి

అటు.. గుంటూరు తొక్కిసలాట ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు పవన్. ఈ ఘటనలో ముగ్గురు పేద మహిళలు చనిపోవడం దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు. ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు పటిష్టమైన చర్యలు చేపట్టడంతో పాటు పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు పవన్.

Also Read..Stampede At Chandrababu Meeting : చంద్రబాబు సభలో తొక్కిసలాటకు కారణం అదేనా?

న్యూ ఇయర్ సందర్భంగా గుంటూరు వికాస్ నగర్ లో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 30వేల మందికి కానుకలు పంపిణీ చేస్తామని ప్రకటనలు ఇచ్చారు. దీంతో అక్కడికి భారీగా మహిళలు వచ్చారు. అయితే, కానుకల కోసం అంతా ఎగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిస‌లాట జ‌ర‌గ‌డంతో ఘటనా స్థలంలోనే ఓ మహిళ మృతిచెందగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు మరణించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

గుంటూరు వికాస్ నగర్ లో ఉయ్యూరు చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రసంగం కొనసాగినంత సేపు సజావుగానే ఉన్న సభ, ఆయన వెళ్లిపోయిన తర్వాత అదుపుతప్పింది. కార్యక్రమ నిర్వాహకులు, టీడీపీ నేతలు పరిస్థితిని కంట్రోల్ చేయలేకపోయారు. కానుకల కోసం మహిళలు ఎగబడ్డారు. దీంతో ఘోరం జరిగిపోయింది.

ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. అధికార వైసీపీ.. టీడీపీని, చంద్రబాబుని టార్గెట్ చేసింది. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలైపోతున్నారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తొక్కిసలాటకు నిర్వాహకుల వైఫ్యలమే కారణం అని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మొన్న కందుకూరులో, ఇప్పుడు గుంటూరులో.. ఇలా తొక్కిసలాటలు జరిగి అమాయకుల ప్రాణాలో పోవడానికి చంద్రబాబే కారణం అంటున్నారు వైసీపీ నేతలు. ఇవన్నీ కూడా చంద్రబాబు చేస్తున్న హత్యలే అని అన్నారు.