Stampede At Chandrababu Meeting : చంద్రబాబు సభలో తొక్కిసలాటకు కారణం అదేనా?

నాలుగు రోజుల్లోనే రెండో దుర్ఘటన. మొన్న కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటన మరువక ముందే మరో విషాదం నెలకొంది. ఆదివారం గుంటూరులోని వికాస్ నగర్ లో చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.

Stampede At Chandrababu Meeting : చంద్రబాబు సభలో తొక్కిసలాటకు కారణం అదేనా?

Stampede At Chandrababu Meeting : నాలుగు రోజుల్లోనే రెండో దుర్ఘటన. మొన్న కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట ఘటన మరువక ముందే మరో విషాదం నెలకొంది. ఆదివారం గుంటూరులోని వికాస్ నగర్ లో చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.

చీరలు, తోఫా పంపిణీ కార్యక్రమంలో ఈ దుర్ఘటన జరిగింది. చీరల కోసం మహిళలు ఒక్కసారిగా ఎగబడ్డారు. బ్యారికేడ్లు లేకపోవడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో ఊపిరాడక పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఇక తీవ్రంగా గాయపడ్డ నలుగురిలో ముగ్గురు మృతి చెందారు. స్పాట్ లోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులను రమాదేవి, ఆషియా గుర్తించారు.

Also Read..Kandukur Accident: చంద్రబాబు సభలో తోపులాట.. ఏడుగురి మృతి.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు

న్యూ ఇయర్ వేళ టీడీపీ ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు, తోఫా పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుక పేరుతో ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30వేల మందికి చీరల పంపిణీని చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు.

దీని కోసం గత పది రోజులుగా స్థానికంగా విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో న్యూ ఇయర్ కానుక తీసుకునేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

దీంతో చీరలున్న లారీల వైపు మహిళలు కదిలారు. చీరల కోసం ఎగబడ్డారు. కానుకల కోసం పోటీపడి ఎగబడ్డారు. మహిళలను అదుపు చేయడంలో కార్యకర్తలు విఫలం కావడం, క్యూ లైన్లు సరిగా లేకపోవడం, సరిపడ బారికేడ్లు ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట జరిగింది.

Also Read..Stampede In Guntur: చంద్రబాబు సభలో మరోసారి కలకలం… తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతి

వెంటనే మహిళలు పక్కకు లాగేశారు. కానీ కింద పడ్డ మహిళలు అప్పటికే స్పృహ కోల్పోయారు. ఇక పరిస్థితి విషమించి ముగ్గురు మహిళలు మృతి చెందారు. దీంతో వికాస్ నగర్ లో హృదయవిదారక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుర్ఘటనపై స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కందుకూరు దుర్ఘటన తర్వాత ఇవాళ కానుకల పంపిణీకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు ముందే పార్టీ నేతలకు సూచించారు. ఈ మేరకు టీడీపీ నేతలు చర్యలు తీసుకున్నారు. అయితే, ఆ ప్రాంతం ఇరుక్కుగా ఉండటం, కానుకలు తీసుకుని వెళ్లిపోవాలనే కంగారు, ఆత్రుతలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగిన ప్రాంతం ఇరుక్కుగా ఉండటంతో ఆ ప్రాంతానికి అంబులెన్స్ సైతం వెళ్లలేదు. దీంతో స్పృహ తప్పి పడిపోయిన వారిని అంబులెన్స్ దగ్గరికి మోసుకుని వెళ్లారు పోలీసులు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.