Kandukur Accident: చంద్రబాబు సభలో తోపులాట.. ఏడుగురి మృతి.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా, కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో ప్రమాదం జరిగి ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రబాబు సభ నిర్వహిస్తుండగా ఆ ప్రాంగణంలో తోపులాట జరిగి, పలువురు టీడీపీ కార్యకర్తలు డ్రైనేజీ కాలువలో పడినట్లు తెలుస్తోంది. వారిలోని ఏడుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ ప్రమాద ఘటనతో చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ఆపి ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు.

Kandukur Accident: చంద్రబాబు సభలో తోపులాట.. ఏడుగురి మృతి.. మరో ఏడుగురికి తీవ్రగాయాలు

Kandukur Accident

Kandukur Accident: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా, కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో ప్రమాదం జరిగి ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రబాబు సభ నిర్వహిస్తుండగా ఆ ప్రాంగణంలో తోపులాట జరిగి, పలువురు టీడీపీ కార్యకర్తలు డ్రైనేజీ కాలువలో పడినట్లు తెలుస్తోంది. వారిలోని ఏడుగురు మృతి చెందగా, మరో ఏడుగురికి ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.

ఈ ప్రమాద ఘటనతో చంద్రబాబు నాయుడు తన ప్రసంగాన్ని ఆపి ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. గాయాలపాలైన వారిని కూడా పరామర్శించి వారితో మాట్లాడారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… అమాయకులు మృతి చెందడం బాధకలిగిస్తోందని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

అలాగే, వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. కందుకూరులో ఇవాళ నిర్వహించిన సభను సంతాప సభగా ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు. బాధితులకు పిల్లలు ఉంటే వారిని ఎన్టీఆర్ ట్రస్ట్ కింద చదివిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల మృతి పట్ల చంద్రబాబు నాయుడు కొద్దిసేపు మౌనం పాటించారు. మృతుల పేర్లు చినకొండయ్య, కాకుమాని రాజా, దేవినేని రవీంద్ర బాబు, యాటగిరి విజయ, కలవకూరి యానాది, పురుషోత్తం, మధుబాబుగా అధికారులు గుర్తించారు.

Pawan Letter CM Jagan : సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ