పోత్తుల్లో భాగంగా పవన్ కీలక భేటీ.. క్లారిటీ వచ్చేస్తుంది

  • Publish Date - March 16, 2019 / 08:02 AM IST

ఎన్నికల షెడ్యూల్ రావడం.. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ రానుండడంతో జనసేన పార్టీ పొత్తుల్లో భాగంగా సీట్ల సర్ధుబాటు చేసుకునేందుకు వామపక్షాలతో సమావేశం ఏర్పరుచుకుంది.  వామపక్షాలు, జనసేన కూటమి అభ్యర్థుల విజయం కొరకు కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు సీట్ల పంపకాల విషయమై పవన్  వామపక్షాల నేతలతో విజయవాడలో సమావేశం అయ్యారు. బీఎస్పీతో కూడా కలిసి పోటీ చేస్తానని ప్రకటించిన క్రమంలో పవన్ వారికి కూడా సీట్లు కేటాయించే అవకాశం ఉంది.
Read Also : కోమటిరెడ్డికి కాంగ్రెస్ హ్యండ్.. కారణం ఇదేనా?

ఇప్పటికే పలుమార్లు కమ్యునిష్టు నేతలతో జనసేన నాదెండ్ల మనోహర్ చర్చలు జరపగా.. ఇవాళ(16 మార్చి 2019) జరిగుతున్న సమావేశంలో పూర్తి క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే వామపక్షాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 26 శాసనసభ, నాలుగు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని పవన్‌కు తెలపగా.. దీనిపై తమకు పట్టున్న సీట్ల జాబితాతో సహా చర్చలు ప్రారంభించాయి. 

విశాఖలో కమ్యూనిస్ట్ పార్టీల జాతీయ నాయకులతో ఇంతకుముందు పవన్‌కల్యాణ్‌ భేటీ అయ్యి సీట్ల విషయాలపై చర్చించారు. అయితే వారు అడుగుతోన్న స్థానాల్లో ఎవరి బలమెంత? గతంలో వారికి వచ్చిన ఓట్లు, జనసేనకు ఉన్న బలంపై నివేదికల ఆధారంగా పవన్ కళ్యాణ్‌తో వామపక్ష నాయకులు చర్చిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సాయంత్రంలోపు ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయమై క్లారిటీ రానుంది.