Pawan Kalyan : రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలవనున్న పవన్ కల్యాణ్

చంద్రబాబును కలిసేందుకు పవన్ రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. ఆయనను కలిసి పరామర్శించనున్నారు. 

Pawan Kalyan to Visit Rajahmundry Central Jail

Pawan Kalyan- Chandrababu : స్కిల్ డెవలప్ మెంట్ లో కేసు ( skill development case)లో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు (Chandrababu)అరెస్టుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అరెస్ట్ చేసిన తీరు సరిగా లేదని జాతీయ స్థాయి నేతలు విమర్శిస్తున్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబు అరెస్ట్ తీరును ఖండించారు. చంద్రబాబుకు మద్దతు తెలిపారు. చంద్రబాబును కలిసేందుకు పవన్ రేపు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. ఆయనను కలిసి పరామర్శించనున్నారు.

Sidharth Luthra : న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాడటమే సరైనది : సిద్ధార్థ లూథ్రా సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు అరెస్ట్ అయ్యారనే సమాచారంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు పవన్ యత్నించగా పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో అప్పటినుంచి పవన్ చంద్రబాబును కలవలేదు. ఈక్రమంలో చంద్రబాబుకు రిమాండ్ విధించటం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించటం జరిగింది. ఈరోజుకు మూడు రోజుల నుంచి చంద్రబాబు రాజమండ్రి జైలులోనే ఉన్నారు. ఈక్రమంలో పవన్.. చంద్రబాబును కలిసేందుకు రేపు రాజమండ్రి జైలుకు వెళ్లనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి వెళ్లి జైలులో చంద్రబాబును పవన్ కలవనున్నారు.

కాగా, చంద్రబాబు అరెస్టును అరెస్టు తీరును జాతీయ నేతలు తీవ్రంగా ఖండించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. చంద్రబాబు అరెస్ట్ తీరును ఖండించారు. లోకేశ్ కు ఫోన్ చేసి పరామర్శించారు. ఏపీ కమ్యూనిస్టు పార్టీ నేతలు, ఏపీ బీజేపీ కూడా చంద్రబాబు అరెస్టును ఖండించింది.

Also Read: చంద్రబాబు అరెస్ట్‌పై అశ్వనీదత్ సంచలన వ్యాఖ్యలు.. వారికి పుట్టగతులు ఉండవంటూ ఆగ్రహం