Sidharth Luthra : న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాడటమే సరైనది : సిద్ధార్థ లూథ్రా సంచలన వ్యాఖ్యలు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు తరపున వాదిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. కత్తి తీసి పోరాడటమే సరైనది అంటూ ఆయన చేసిన ట్వీట్ పెను సంచలనంగా మారింది.

Supreme court lawyer Sidharth Luthra
lawyer Sidharth Luthra ..Chandrababu Arrest : స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగిందని ఆ స్కామ్ కు ప్రధాన సూత్రధారి చంద్రబాబు అనే ఆరోపణలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు తన తరపున వాదించటానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రాను నియమించుకున్నారు. ఈకేసులో చంద్రబాబు తరపున వాదిస్తున్నారు లూథ్రా. ఈ క్రమంలో ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. చంద్రబాబుకు బెయిల్ కోసం యత్నిస్తున్నారు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. కానీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు వాయిదాలు వేస్తోంది.
ఈక్రమంలో సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘ అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు.. న్యాయం కనుచూపు మేరలో లేదని తెలిసినప్పుడు కత్తి తీసి పోరాడటమే సరైంది’’ అంటూ ట్వీట్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. గురుగోవింద్ సింగ్ వ్యాఖ్యలను కోడ్ చేస్తు లూథ్రా ట్వీట్ చేశారు. ఇదే నా నినాదం అంటూ లూథ్రా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తరపున లూథ్రా వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబుకు రిమాండ్ విధించవద్దని..హౌస్ అరెస్ట్ కు అనుమతి ఇవ్వాలని వాదించారు. చంద్రబాబుకు జైలులో భద్రత లేదని కాబట్టి హౌస్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. కానీ కోర్టుమాత్రం చంద్రబాబుకు రిమాండ్ విధించింది. బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తుల విచారణను కూడా ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఈ క్రమంలో సిద్ధార్థ లూథ్రా ట్విట్టర్ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. లూథ్రా చేసిన ఈ వ్యాఖ్యలు చర్చలకు దారి తీశాయి.
Motto for the day pic.twitter.com/gh0VsVYm8G
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 13, 2023
కాగా చంద్రబాబు సీఐడీ వేసిన కస్టడీ పిటీషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈనెల 18 వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. చంద్రబాబును ఐదు రోజుల కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో సిఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సీఐడీ పిటిషన్ పై ఎలాంటి విచారణ చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించింది. అదేవిధంగా అమరావతి రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది.