Kerala HC : స్విగ్గీ, జొమాటోలు వద్దు .. పిల్లలకు తల్లుల చేతిరుచులు చూపించండీ : కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

స్విగ్గి, జొమాటో ఆర్డర్లను పక్కన పెట్టి తల్లులు పిల్లలకు స్వయంగా వండి పెట్టండీ..పిల్లలు అమ్మ చేతి వంట రుచి చూపిండండీ అంటూ కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Kerala HC : స్విగ్గీ, జొమాటోలు వద్దు .. పిల్లలకు తల్లుల చేతిరుచులు చూపించండీ : కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Kerala HC kids Mothers cooked food

Kerala HC kids Mothers cooked food : ఇప్పుడంతా ఒక్క క్లిక్ చేసి హలో అంటే పొలో అంటూ నట్టింటిలో వాలిపోతున్నాయి ఆహారాలు. బిర్యానీ తినాలనిపిస్తే ఫోన్ లో క్లిక్ చేస్తే చాలు నిమిషాల్లో ఇష్టమైన బిర్యాని చేతుల్లో ఉంటోంది.వండుకునే పనిలేదు..వంట ఇంటిలో కుస్తీలు పట్టాల్సిన పనిలేదు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్ లైన్ ఆర్డర్లతో నిమిషాల్లో ఇష్టమైనవి ఇంట్లోకొచ్చి పడుతున్నాయి.అంతే ఆర్డర చేయండీ తినేయండీ అనే కాన్సెప్టులు నడుస్తున్నాయి.

తల్లులు కూడా పిల్లలు పిజ్జాకావాలన్నా..బర్గర్ కావాలన్నా..బిర్యానీ కావాలన్నా ఇలా ఆర్డ్ చేసి అలా పిల్లలకు తినిపించేస్తున్నారు. పిల్లలు కూడా బయటి రుచులకే అలవాటుపడిపోతున్నారు. దీనికి కారణం మహిళలు కూడా ఉద్యోగాలు చేయటం..సరైన సమయం లేకపోవటం, అలసిపోయి ఇంటికొచ్చాక పిల్లలు అది కావాలి ఇది కావాలనిఅడిగితే వండిపెట్టే ఓపిక సమయం లేకపోవటం కూడా కారణంగా మారుతోంది. కానీ వండిపెట్టే సమయం ఉన్నా..ఏం వండుతాంలే ఆర్డర్ చేస్తే పోలా అనుకోవటానికి కారణమవుతోంది.

viral video : కాసేపు ఆగలేకపోతున్నావా .. పెళ్లి పీటలపైనే వరుడు చెంపఛెళ్లుమనిపించిన వధువు

ఇదిలా ఉంటే ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి పిల్లలకు బయటి ఫుడ్ పెట్టటంపై కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ కన్హికృష్ణన్ స్విగ్గి(Swiggy), జొమాటో(Zomato )లను పక్కన పెట్టి చిన్నారులకు తల్లుల చేతి రుచులు చూపించాలని సూచించారు. పిల్లలకు తల్లి చేతి వంట ప్రాముఖ్యత గురించి న్యాయమూర్తి నొక్కి చెప్పారు. ‘పిల్లలను ఆరుబయట ప్రాంతాల్లో ఆడుకునేలా ప్రోత్సహించండి..పిల్లలు అలిసిపోయి ఇంటికి వచ్చే సమయానికి కమ్మగా వండి పెట్టండి’ అంటూ ఆసక్తికర సూచనలు చేశారు. అంతేకాదు ‘‘తల్లి చేతి వంటలోని ఆనందాన్ని పిల్లలు ఆస్వాదించేలా చూడండీ..పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి స్విగ్గీ(swiggy)లు, జొమాటో(Zomato )లలో ఆర్డర్ పెట్టుకునేలా ప్రోత్సహించవద్దు’ అని సూచించారు.

అశ్లీల చిత్రాల నేరాలకు సంబంధించిన కేసును విచారిస్తున్న సందర్భంగా జస్టిస్ పీవీ కన్హికృష్ణన్(Justice PV Kunhikrishnan) ఈ వ్యాఖ్యలు చేశారు. మైనర్ల చేతికి సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్ ఇవ్వొద్దని..ఒకవేళ ఇవ్వాల్సి వస్తే తరచూ వారిని గమనించాలని..వారు ఫోన్ లో ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని సూచించారు. పిల్లల విషయంలో సరైన పర్యవేక్షణ ఉండాలన్నారు. అలా లేకపోతే స్మార్ట్ ఫోన్ తో అనర్థాలు తప్పవు అంటూ హెచ్చరించారు.

Lucky spiders : ఆ సాలెపురుగును చూస్తే అదృష్టం .. మహిళకు తగిలిన బంపర్ లాటరీ

కాగా..రోడ్డు పక్కన నిలబడిన ఓ వ్యక్తి తన ఫోన్ లో అశ్లీల వీడియోలు చూస్తుండగా పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసు గురించి విచారిస్తున్న సమయంలో జస్టిస్ పీవీ కన్హికృష్ణన్ తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తు.. అశ్లీల వీడియోలు, ఫొటోలు ఇతరులకు పంపించడం, బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం నేరం అని అన్నారు. దీనికి సదరు వ్యక్తి తన ఫోన్ లో ప్రైవేటుగా పోర్న్ చూస్తున్నారే తప్ప ఇతరులకు పంపడం కానీ, ప్రదర్శించడం కానీ చేయలేదని అన్నాడు. దీంతో ఓ వ్యక్తి ప్రైవేటుగా అశ్లీల వీడియోలు చూడడం ఐపీసీ సెక్షన్ 292 కిందికి రాదని, దానిని నేరంగా పరిగణించలేమని స్పష్టం చేశారు. పోలీసులు పెట్టిన ఈ కేసును న్యాయమూర్తి కొట్టేవేశారు.

అదే సందర్భంగా ఆన్ లైన్ యాప్ ల ద్వారా వంటకాలు ఆర్డ్ చేసిన పిల్లలకు పెట్టటం కంటే తల్లులు వండి పెట్టాలని సూచించారు. అలా ఇంట్లోనే తల్లులు వంటి చేసిన పెట్టటం ఆరోగ్య రీత్యా పిల్లలకు మంచిదని సూచించారు.