Janasena chief Pawan Kalyan's first political comments from On the 'Varahi' vehicle (1)
Pawan kalyan ‘VARAHI’ : తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో తన ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’కు ప్రత్యేక పూజలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో ‘వారాహి’కి ప్రత్యేక పూజలు చేశారు. దుర్గమ్మకు చీర, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల అనంతరం పవన్ మాట్లాడుతూ..ఇన్నాళ్లు పక్కనే ఉన్న తాను దుర్గమ్మను దర్శించుకోలేకపోయానని కానీ ఇప్పుడు అమ్మ పిలుపు వచ్చింది.అందుకే ‘వారాహి’తో కలిసి వచ్చానని అన్నారు పవన్. విజయవాడ కనకనక దుర్గమ్మ సన్నిధిలో ‘వారాహి’ వాహనానికి ప్రత్యేక పూజలు చేసిన పవన్ కల్యాణ్ కొండపై రాజకీయాల గురించి మాట్లాడనని అన్నారు. అనంతరం ఇంద్రకీలాద్రి కొండ దిగాక ‘వారాహి’వాహనం ఎక్కి ‘వారాహి’ లక్ష్యం రాక్షస పాలన అంతం చేయటమేనని తనదైన శైలిలో పవన్ పంచ్ వేశారు.
కొండగట్టు ఆంజనేయ స్వామితో పవన్ కు మంచి అనుబంధం ఉంది. గతంలో ఎన్నోసార్లు కొండగట్టు అంజన్నను సందర్శించుకున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో ప్రచారం రథానికి కూడా కొండగట్టు అంజన్న సన్నిథిలోనే తొలిపూజ చేయించారు. ఈనంతరం విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో కూడా పూజలు చేయించారు. ఎందుకంటే ‘వారాహి’ అంటే అమ్మలగన్న అమ్మ అంశం..అలా ప్రతీ విషయాలన్ని కూలకషంగా పరిశీలించి తన ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు రచించుకుంటూ ఒక్కో అడుగు విశ్లేషణాత్మకంగా వేస్తున్నారు పవన్ కల్యాణ్.
దుర్గమ్మను దర్శించుకున్న తరువాత పవన్ మాట్లాడుతూ ఇన్నాళ్లు పక్కనే ఉన్నా అమ్మను దర్శించుకోలేకపోయాను..కానీ ఈరోజు అమ్మ పిలిచింది అందుకే వచ్చానని అన్నారు. అనంతరం కొండ దిగాక వారాహి వేదికగా పవన్ తొలి పొలిటికల్ కామెంట్స్ చేశారు. ‘వారాహి’ లక్ష్యం రాక్షస పాలన అంతం చేయటమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని అలాగే ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలు ఐకమత్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. అభివృద్ధిలో ఏపీ ముందుకెళ్లాలని దానికోసం పంచాయతీల నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాలన తీరు మారాలన్నారు. దీని కోసం నాయకత్వం కూడా మారాలన్నారు.పవన్ కామెంట్ కు వేలాదిగా తరలి వచ్చిన జనసైనికులు హర్షం వ్యక్తంచేశారు. జై జనసేన అంటూ నినాదాలు చేశారు.