Janasena : జనసేనకు మరో షాక్? వైసీపీలోకి ఆ జిల్లా అధ్యక్షుడు?

పొత్తులో భాగంగా నెల్లూరు సిటీ టికెట్ ను తెలుగుదేశం పార్టీకి కేటాయించారు.

Manukranth ChennaReddy

Janasena : నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డిని ఆయన నివాసంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు. కొంతకాలంగా మనుక్రాంత్ రెడ్డి జనసేనపై అసంతృప్తిగా ఉంటున్నారు.

జనసేన తరుపున నెల్లూరు సిటీ అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు మనుక్రాంత్ రెడ్డి. పొత్తులో భాగంగా నెల్లూరు సిటీ టికెట్ ను తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. తన అనుచరులతో చర్చించి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని మనుక్రాంత్ రెడ్డి తెలిపారు.

విజయసాయిరెడ్డి కామెంట్స్..
జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మను క్రాంత్ రెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించాం. మను క్రాంత్ రెడ్డి హోదా, అనుభవానికి తగినట్టుగా పార్టీలో మంచి స్థానాన్ని కల్పిస్తాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మను క్రాంత్ రెడ్డి రాజకీయ భవితవ్యంపై మంచి నిర్ణయం తీసుకుంటాం. ప్రజా జీవితంలో ఆరు సంవత్సరాలుగా ఉన్నారు. ఆయన చేరిక వల్ల పార్టీ కూడా బలోపేతమవుతుంది.

జనసేన జిల్లా అధ్యక్షుడు మను క్రాంత్ రెడ్డి కామెంట్స్…
వైసీపీలోని కీలక నాయకులు నన్ను వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ గౌరవం కొద్దిమందికే దక్కింది. పార్టీ నేతలతో చర్చించి ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా. మెజారిటీ ప్రజలు మద్దతు తెలుపుతున్న పార్టీలో చేరుతున్నా. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా. సీటు రాకపోవడం కూడా నేను పార్టీని వీడేందుకు ఒక కారణం. నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ అండగా ఉంటారని భావిస్తున్నా. నాతో పాటు పలువురు వైసీపీలో చేరతారు.

Also Read : టార్గెట్‌ బాలయ్య.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటమికి వైసీపీ భారీ స్కెచ్‌..! ఏంటా వ్యూహం

ట్రెండింగ్ వార్తలు