Dharmavaram: పగలు గుడ్ మార్నింగ్.. రాత్రి దాడులు: కేతిరెడ్డిపై జనసేన నేత ఫైర్

కేతిరెడ్డి దమ్ముంటే నాతో తేల్చుకో.. రా చూసుకుందాం టైమ్ ప్లేస్ నువ్వు చెప్పినా సరే లేదా నన్ను చెప్పమన్నా సరే అటో ఇటో తేల్చుకుందాం. ఇక నీ ఆటలు సాగవు.

JanaSena Leader Chilakam Madhusudhan Reddy takes on MLA Kethireddy

Chilakam Madhusudhan Reddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి బారి నుంచి ధర్మవరాన్ని కాపాడాలని డీజీపీని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి కోరారు. ధర్మవరంలో కేతిరెడ్డి ఆగడాలకు అంతులేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తపై కోటిరెడ్డి రాజారెడ్డిపై కేతిరెడ్డి దాడి చేయించారని ఆరోపించారు. వైసీపీ దాడికి నిరసనగా ధర్మవరంలో ఆదివారం శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రజాస్వామ్యవాదులంతా ఈ ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలియజేయాలని కోరారు.

కేతిరెడ్డి నీ పద్ధతి మార్చుకో..
ఎమ్మెల్యే కేతిరెడ్డి తన పద్ధతి మార్చుకుని.. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని మధుసూదన్ రెడ్డి హితవు పలికారు. ”ధర్మవరానికి దరిద్రంలా దాపురించావ్. పగలు గుడ్ మార్నింగ్.. రాత్రి దాడులు, హత్యలు. నీ వల్ల ఇప్పటికే ఎంతో మంది వ్యాపారులు ఊళ్లు విడిచిపోయారు. వాళ్ల ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. పోలీసుల సహకారంతోనే రాజారెడ్డిపై దాడి జరిగింది. రాజారెడ్డి చాలా సౌమ్యుడు, ఆయనకు ఎటువంటి నేర చరిత్ర లేదు. అలాంటి వ్యక్తిపై కేతిరెడ్డి దుర్మార్గంగా దాడి చేయించాడు. కేతిరెడ్డి లాంటి వారిని జగన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారు.

Also Read: మేము అధికారంలోకి రాగానే దీనిపైనే తొలి విచారణ జరిపిస్తాం: పవన్ కల్యాణ్

ధర్మవరంలో మాంగళ్య షోరూం రావడం వలన స్థానిక వ్యాపారులపై దెబ్బ పడింది. వ్యాపారస్తులకు, చేనేతలకు జనసేన నాయకులు అండగా ఉన్నారు. అందుకే అక్కసుతో జనసేన నాయకులపై ఎమ్మెల్యే దాడులు చేయించారు. కేతిరెడ్డి దమ్ముంటే నాతో తేల్చుకో.. రా చూసుకుందాం టైమ్ ప్లేస్ నువ్వు చెప్పినా సరే లేదా నన్ను చెప్పమన్నా సరే అటో ఇటో తేల్చుకుందాం. ఇక నీ ఆటలు సాగవు. నేను క్రైం వదిలేసి 20 ఏళ్లైంది. నేను మొదలుపెడితే ఎలా ఉంటుందో చూసుకోండి. రేపు ధర్మవరంలో శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రజలంతా పాల్గొనాలి. మా పార్టీ కార్యకర్తపై దాడి విషయంలో డీజీపీ స్పందించాలి. ధర్మవరానికి ఐపీఎస్ అధికారిని నియమించాల”ని మధుసూదన్ రెడ్డి అన్నారు.

Also Read: భయమనేది టీడీపీ బయోడేటాలోనే లేదు, ఇందిరాగాంధీకే భయపడలేదు.. జగన్‌కు భయపడతామా?: లోకేశ్