టీడీపీ నేతలపై జనసేన నేత పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు..

పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. కానీ, పిఠాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగి నానా బీభత్సం సృష్టించారు.

Janasena Leader Pothina Mahesh : జనసేన పార్టీ విజయవాడ అధ్యక్షుడు పోతినేని మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకుదిగి నానా బీభత్సం సృష్టిస్తుంటే.. టీడీపీ నేతలు స్పందించక పోవటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ.. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. కానీ, పిఠాపురంలో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగి నానా బీభత్సం సృష్టించారు. ఇంత జరుగుతున్నా టీడీపీలో కీలక నేతలు ఎవరూ స్పందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Lok Sabha Election 2024 : రేపే లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్.. ప్రకటించిన ఈసీ

జనసేన అధినేత పవన్ కోసం జనసైనికులు స్పందించాలి. పార్టీ అధ్యక్షుడికే నిరసన తెలిపితే ఓట్ల బదిలీ ఎలా జరుగుతుంది..? పొత్తు ధర్మలో భాగంగా మిగతా పార్టీలుకూడా స్పందించాలని మహేష్ అన్నారు. జనసేన నుంచి కూడా రాష్ట్ర నాయకత్వం స్పందించాలి. ఎందుకు స్పందించడం లేదు? జనసేన రాష్ట్ర నాయకత్వం కూడా బయటకు వచ్చి చర్యలు చేపట్టాని మహేష్ కోరారు. గతంలో కూడా పవన్ ఓటమి పాలయ్యారు కాబట్టి ఈసారి జాగ్రత్త చర్యలు తీసుకోవటం ఇప్పుడు అవసరం అని అన్నారు.

Also Read : Pithapuram Constituency: వెనక్కి తగ్గనంటున్న వర్మ, పిఠాపురంలో ఏం జరగనుంది..?

బెజవాడ పశ్చిమ సీటును జనసేనకు ఇవ్వాలి. గత ఎనిమిదేళ్లుగా పార్టీకోసం పనిచేశాను. వైసీపీ పాలనలో కేసులు పెట్టించుకున్నాం. జనసేన బలంగా ఉండబట్టే వైసీపీ సిట్టింగ్ అభ్యర్థిని మాచ్చేసింది. పొత్తులో భాగంగా పశ్చిమ సీటును జనసేనకు కేటాయించాలి. పవన్ పై పూర్తి నమ్మకం ఉంది. స్థానిక ఎన్నికల్లో మంచి ఓటు బ్యాంకు జనసేనకు వచ్చింది. గత పదేళ్లుగా నాతో పాటు పార్టీ నేతలు డబ్బు, సమయం రెండు కేటాయించాం. పశ్చిమ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తానని పోతిన మహేష్ అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు