Lok Sabha Election 2024 : రేపే లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్.. ప్రకటించిన ఈసీ

లోక్ సభసహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ రేపు మధ్యాహ్నం 3గంటలకు షెడ్యూల్ విడుదల చేయనుంది.

Lok Sabha Election 2024 : రేపే లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్.. ప్రకటించిన ఈసీ

Election Commission

Election Schedule 2024 : లోక్ సభ ఎన్నికలకు  షెడ్యూల్ ను ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. శనివారం (మార్చి 16) మధ్యాహ్నం 3గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటిస్తామని ఈసీ తెలిపింది. సోషల్ మీడియా వేదికగా ఈసీ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, జ్ఞానేశ్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సందు ప్రకటించనున్నారు. లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించనుంది.

Also Read : Electoral Bonds Case : ఎలక్టోరల్ బాండ్స్ కేసులో ఎస్‌బీఐపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

లోక్ సభలో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్ లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పర్యటించి ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఇప్పటికే పరిశీలించారు. ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. 1.85 కోట్ల ఓటర్లు కొత్తగా ఓటు హక్కును నమోదు చేసుకున్నారు. దేశంలో 96.88 కోట్ల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ పాదర్శకంగా జరిగేందుకు రాష్ట్రాల పరిశీలకులకు ఇప్పటికే సీఈసీ దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే.

Also Read : సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు

దేశవ్యాప్తంగా 2,100 ఎన్నికల పరిశీలు ..
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా 2,100 ఎన్నికల పరిశీలకులను సీఈసీ నియమించింది. ఎన్నికల ప్రణాళిక, పరిశీలకుల పాత్ర, బాధ్యతలు, ఎలక్టోరల్ రోల్ సమస్యలు, మోడల్ ప్రవర్తనా నియమావళి అమలు, చట్టపరమైన నిబంధనలు, EVM/VVPAT నిర్వహణ, మీడియా ఎంగేజ్‌మెంట్, కమిషన్ ఫ్లాగ్‌షిప్ SVEEP (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) ప్రోగ్రామ్ కింద పరిశీలకులకు సీఈసీ అవగాహన కల్పించింది. అదేవిధంగా ఎన్నికల్లో పరిశీలకులుగా 900 మంది జనరల్ అబ్జర్వర్లు, 450 మంది పోలీస్ అబ్జర్వర్లు, 800 మంది వ్యయ పరిశీలకులు
పనిచేయనున్నారు.