సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు

మాజీ మంత్రి ముదగ్రడ పద్మనాభం, ఆయన కుమారుడు వైసీపీలో చేరారు. సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు.

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు

Mudragada Padmanabham

YS Jagan : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసంకు కుమారుడు గిరితో కలిసి ముద్రగడ పద్మనాభం వెళ్లారు. జగన్ వారిద్దరికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు పలువురు ముద్రగడ అనుచరులు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడను సీఎం జగన్ ఆప్యాయంగా హత్తుకొని అభినందనలు తెలిపారు. గత కొద్దిరోజులుగా ముద్రగడ వైసీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో వైసీపీ నేతలు ముద్రగడ నివాసంకు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వైసీపీలో చేరాలని ఆహ్వానించారు. దీంతో గత మూడు రోజుల క్రితం వైసీపీలో చేరుతున్నట్లు ముద్రగడ ప్రకటించారు. ఎలాంటి హంగూఆర్బాటం లేకుండా ముద్రగడ, ఆయన కుమారుడు, పలువురు అనుచరులతో కలిసి తాడేపల్లి నివాసంకు వెళ్లి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

Also Read : ఉమ్మడి విశాఖ జిల్లాలో అసంతృప్తి సెగలు.. టీడీపీ, జనసేన నాయకులు రాజీనామాల బాట

పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే, ముద్రగడ పవన్ పై పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ముద్రగడ పోటీకిదూరంగా ఉంటే ఆయన కుమారుడు గిరి పవన్ పై వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ విషయంపై రెండుమూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పిఠాపురం వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్తగా వంగా గీత విశ్వనాధ్ కొనసాగుతున్నారు.