ఉమ్మడి విశాఖ జిల్లాలో అసంతృప్తి సెగలు.. టీడీపీ, జనసేన నాయకులు రాజీనామాల బాట

టీడీపీ రెండో జాబితా కూటమిలో చిచ్చు రాజేసింది. అసంతృప్తి పెల్లుబికుతోంది. ఒకవైపు టీడీపీ నేతలు, మరోవైపు జనసేన నేతలు రాజీనామాల బాటపడుతున్నారు.

ఉమ్మడి విశాఖ జిల్లాలో అసంతృప్తి సెగలు.. టీడీపీ, జనసేన నాయకులు రాజీనామాల బాట

TDP Tickets Issue

Ap Politics : టీడీపీ రెండో జాబితా కూటమిలో చిచ్చు రాజేసింది. అసంతృప్తి పెల్లుబికుతోంది. ఒకవైపు టీడీపీ నేతలు, మరోవైపు జనసేన నేతలు రాజీనామాల బాటపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ పట్టణం జిల్లాలో నేతల అసంతృప్తి తారాస్థాయికి చేరింది. టికెట్ దక్కని ఆశావహులు ఆవేదనతో టీడీపీ, జనసేన పార్టీలకు రాజీనామాలు చేస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గం టికెట్ దక్కకపోవటంతో జనసేనకు రాజీనామా చేస్తున్నట్లు పరుచూరి భాస్కర్ ప్రకటించారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. కమ్మ కులంలో పుట్టడం తాను చేసిన తప్పంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఇవాళ ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also Read : Alliance Politics : భగ్గుమన్న అసంతృప్తులు.. ఎందుకిలా? కారణం ఎవరు? కూటమిలో కుంపటిపై తెలకపల్లి రవి విశ్లేషణ..

పాడేరు టికెట్ టీడీపీ అభ్యర్థి గిడ్డిశ్వరీకి కేటాయించకపోతే రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ గిడ్డి ఈశ్వరి వర్గీయులు తేల్చిబుతున్నారు. మరోవైపు పెందుర్తి సీటు బండారుకు కేటాయించాలని టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మాడుగుల నియోజకవర్గం టికెట్ రామానాయుడుకు ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విశాఖ సౌత్ నియోజకవర్గ ఇన్ ఛార్జి గండి బాబ్జీ టీడీపీకి రాజీనామా చేశారు. విశాఖ సౌత్ స్థానాన్ని జనసేన అభ్యర్థి వంశీ యాదవ్ కి కేటాయించడంతో మనస్థాపం చెందిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి.

Also Read : YS Jagan: చంద్రబాబు, దత్తపుత్రుడి పేర్లు చెబితే ఏం గుర్తుకువస్తాయి?: జగన్

టీడీపీ రెండో లిస్టులోనూ తన పేరు లేకపోవడంతో మాజీ మంత్రి శ్రీనివాసరావు అసంతృప్తితో ఉన్నాడు. అనుచరులతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. ఈ సమావేశం తర్వాత ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. భీమిలి సీటు కోసం గంటా శ్రీనివాస్ రావు పట్టుబడుతుండగా.. చంద్రబాబు మాత్రం చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. రెండో జాబితాలో తనపేరు లేకపోవటం పట్ల ఇంకా అలకలోనే గంటా ఉన్నారు. నేడు లేదా రేపు తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలాఉంటే టికెట్ దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న పలువురు నేతలను చంద్రబాబు, టీడీపీ నేతలు బుజ్జగిస్తున్న పరిస్థితి. పీఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ తరపున టికెట్ ఆశించిన వర్మ, ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో వర్మకు, అదేవిధంగా బోడే ప్రసాద్ కు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి సమయమనం పాటిచాలని సూచించినట్లు సమాచారం.