YS Jagan: చంద్రబాబు, దత్తపుత్రుడి పేర్లు చెబితే ఏం గుర్తుకువస్తాయి?: జగన్

YS Jagan: వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వ్యక్తి గుర్తుకు వస్తారని జగన్ అన్నారు.

YS Jagan: చంద్రబాబు, దత్తపుత్రుడి పేర్లు చెబితే ఏం గుర్తుకువస్తాయి?: జగన్

YS Jagan

Updated On : March 15, 2024 / 2:24 PM IST

బీజేపీ-టీడీపీ-జనసేనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. నంద్యాల జిల్లాలోని బనగానపల్లెలో వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొని జగన్ ప్రసంగించారు.

‘చంద్రబాబు నాయుడి పేరు చెబితే ఏం గుర్తుకు వస్తుంది? దగా గుర్తుకు వస్తుంది. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా? ఆయనకు విశ్వసనీయత లేదు. దత్తపుత్రుడి పేరు చెబితే ఏం గుర్తుకు వస్తుంది.. వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన వ్యక్తి గుర్తుకు వస్తారు.

ఆరేళ్లకు ఒకసారి కార్లు మార్చినట్లు భార్యలను మార్చే వంచకుడు గుర్తుకువస్తారు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పేదవాడి భవిష్యత్ మీద యుద్ధానికి వస్తున్నాయి. 2014లో కూడా ఇవే పార్టీలు మోసపూరిత హామీలు ఇచ్చి మోసం చేశాయి’ అని జగన్ అన్నారు.

పేదలకు మేలు చేయడంలో ఎవరి ట్రాక్ ‌రికార్డు ఏంటో చూద్దామా? అని చంద్రబాబుకు జగన్ సవాలు విసిరారు. చంద్రబాబు పాలనలో పేదలకు ఒక్క రూపాయైనా లబ్ధిచేకూర్చారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం 99 శాతం హామీలు నెరవేర్చిందని వైఎస్ జగన్ అన్నారు.

Also Read: కేసీఆర్‌కు ఆరూరి రమేశ్‌ షాక్.. బీజేపీలో చేరడానికి ఢిల్లీకి పయనం