పవన్‌కు షాక్ : సీఎం జగన్‌కు జై కొట్టిన రాపాక

  • Publish Date - January 20, 2020 / 10:32 AM IST

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏపీ అసెంబ్లీ సాక్షిగా షాక్ ఇచ్చారు. మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలియచేస్తున్నట్లు ప్రకటించారు. కొన్ని రోజులుగా సీఎం జగన్, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పవన్ వ్యతిరేకిస్తుంటే..రాపాక మద్దతిస్తున్నారు.

2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుని మంత్రి బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడారు. వెనుకబడిన జిల్లాలను, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న తపన సీఎం జగన్‌లో ఉండడం అభినందనీయమన్నారు. 

ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వారికి ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నారు. రాష్ట్ర విభజన అయిన సమయంలో వెనుకబడిన జిల్లాలను పట్టించుకోలేదన్నారు. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల నుంచి వలసలు వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిట్ విశాఖలో వస్తే..అక్కడే పని దొరుకుతుందన్నారు. అమరావతిలో జరిగిన అవినీతి గురించి..మంత్రి బుగ్గన వివరంగా చెప్పడం జరిగిందని, ప్రజలకు ఈ విషయాలు తెలియవన్నారు. తన పదవి కోసం ఆలోచించడం లేదని, రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తానని ఎమ్మెల్యే ఆళ్ల చెప్పడం నిజంగా అభినందనీయమన్నారు రాపాక. 

Read More : బీజేపీ కొత్త చీఫ్ : JP Nadda ముందు సవాళ్లు