×
Ad

Pawan Kalyan : జనసేనాని ఏపీ పర్యటన.. సభలు, సమావేశాల్లో పాల్గొననున్న పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ్టి శనివారం నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరి విజయవాడకు చేరుకోనున్నారు.

  • Published On : March 11, 2023 / 12:10 PM IST

pawan

Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ్టి శనివారం నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరి విజయవాడకు చేరుకోనున్నారు. అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో బీసీ సంక్షేమంపై రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ పాల్గొంటారు. రేపు (ఆదివారం) పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ సమీక్షీస్తారు. అదే సమయంలో పార్టీలో కొందరు నేతలు, కార్యకర్తల చేరిక కార్యక్రమాన్ని పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది.

అలాగే చేగొండి హరిరామ జోగయ్య ఆధ్వర్యంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో కూడా పవన్ సమావేశం అవుతారని తెలుస్తోంది. సోమవారం ఉదయం 11 గంటలకు ఆవిర్భావ సభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో మర్యాదపూర్వకంగా పవన్ భేటీ అవుతారు. మార్చి14వ తేదీన మచిలీపట్నంలో జరిగే ఆవిర్భావ సభలో పవన్ పాల్గొంటారు.

Pawan Kalyan : 13న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్న పవన్ కల్యాణ్

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే నియోజక వర్గాల వారిగా సమన్వయ కర్తలను కూడా నియమించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రతి నియోజక వర్గానికి చెందిన నాయకులకు సమన్వయ కర్తలుగా బాధ్యతలను అప్పగించారు. ఇటు తెలంగాణ ప్రాంతం వచ్చే క్యాడర్ కోసం మరో కమిటీని జనసేన ఏర్పాటు చేసింది.