Pawan Kalyan : వైసీపీ తెగులుకు జనసేన-టీడీపీ వాక్సినే సరైందన్న పవన్ కల్యాణ్.. ఎన్డీయేతో దోస్తీపై హాట్ కామెంట్స్

రాష్ట్ర అభివృద్ధే మాకు ముఖ్యం అని తేల్చి చెప్పారు జనసేనాని పవన్. జనసేన-టీడీపీ ప్రభుత్వం రావడమే వైసీపీకి విరుగుడు అని వ్యాఖ్యానించారు. Pawan Kalyan

Pawan Kalyan On YSRCP

Pawan Kalyan On YSRCP : రాజమండ్రిలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో ప్రధానంగా ఆరు అంశాలపై మూడు గంటల పాటు చర్చించారు పవన్ కల్యాణ్, నారా లోకేశ్. ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణ సహా పలు అంశాలపై ఇరు పార్టీల మధ్య సమాలోచనలు జరిగాయి. టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు అంశాలపై హాట్ కామెంట్స్ చేశారు.

వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని మరోసారి పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. ”వైసీపీ, సీఎం జగన్ విధానాలకు మేము వ్యతిరేకం. ప్రభుత్వ దుర్మార్గపు బెదిరింపులు అన్ని పార్టీల నేతలను ఇబ్బంది పెట్టాయి. వైసీపీ అనే తెగులు రాష్ట్రానికి పట్టింది. ఇది పోవాలంటే టీడీపీ-జనసేన వ్యాక్సిన్ అవసరం. ఎన్డీయేలో ఉండి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పని చేయాలని నిర్ణయించాము” అని పవన్ కల్యాణ్ చెప్పారు.

Also Read : మేము అధికారంలోకి రాగానే దీనిపైనే తొలి విచారణ జరిపిస్తాం: పవన్ కల్యాణ్

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని పవన్ కల్యాణ్ వాపోయారు. ఆంధ్రాలో అడుగుపెట్టకుండా బోర్డర్ లో నన్ను అడ్డుకున్న విధానం అంతా చూశారు అని పవన్ అన్నారు. వైసీపీ దాడి చేయని పార్టీ ఏదీ లేదన్నారు పవన్. అన్ని పార్టీల నేతలను, కార్యకర్తలను జగన్ సర్కార్ ఇబ్బంది పెడుతోందన్నారు. అచ్చెన్నాయుడితో మొదలుపెట్టి చంద్రబాబు వరకు ఈ అరాచకాలు ఆగలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం తన చర్యలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోందని పవన్ ధ్వజమెత్తారు. అస్థిరతకు గురైన ఏపీకి సుస్థిరత ఇవ్వాలనే ఉద్దేశంతోనే, రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీతో పొత్తుకు సిద్ధమయ్యాం అని పవన్ కల్యాణ్ చెప్పారు.

రాష్ట్ర అభివృద్ధే మాకు ముఖ్యం అని తేల్చి చెప్పారు జనసేనాని పవన్. అనుభవం ఉన్న నాయకుడు ఉండాలనే 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చామన్నారు. వైసీపీకి మేము వ్యతిరేకం కాదన్న పవన్ కల్యాణ్.. వారి విధానాలకు మాత్రమే వ్యతిరేకం అని స్పష్టం చేశారు. వైసీపీ అరాచకాలు, దోపిడీకి మేము వ్యతిరేకం అని చెప్పారు. జనసేన-టీడీపీ ప్రభుత్వం రావడమే వైసీపీకి విరుగుడు అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకి బెయిల్ రాకుండా సాంకేతిక కారణాలతో ప్రభుత్వం కుట్ర చేస్తోందని పవన్ ఆరోపించారు. ఇది చాలా ఆవేదన కలిగించిందన్నారు. అన్యాయంగా జైల్లో ఉన్న చంద్రబాబుకు మానసిక మద్దతు కోసమే రాజమండ్రిలో టీడీపీ-జనసేన భేటీ నిర్వహించామని పవన్ కల్యాణ్ వివరించారు. ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు, టీడీపీ కేడర్ కు బలం ఇచ్చేలా సమావేశం అయ్యామన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో, ప్రణాళిక ఎలా ఉండాలి? టీడీపీ, జనసేన నాయకులు, కేడర్ ఎలా కలిసి పని చేయాలి? అనే అంశాలపై లోకేశ్ తో చర్చించినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Also Read : అంతిమ విజయం న్యాయానిదే, త్వరలోనే బయటకు వస్తా, నియంత పాల‌న‌పై పోరాటం కొన‌సాగించండి- తెలుగు ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు బ‌హిరంగ లేఖ

ఇక, తాము ఎన్డీయేతో కలిసే ఉన్నాము అని తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్.. ఏపీలో టీడీపీతో కలిసి పని చేస్తామన్నారు. బీజేపీ అధిష్టానం మా పరిస్థితిని అర్థం చేసుకుందని, ఏపీలో టీడీపీతో కలిసి పని చేయాలని జనసేన తీసుకున్న నిర్ణయంపై కేంద్రం పెద్దలు సానుకూలంగా ఉన్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.

”జనసేన ఎన్డీయే పార్టనర్. ఏపీలో చిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మా ప్రాధాన్యత. దీన్ని బీజేపీ అగ్రనాయకులు కూడా అర్థం చేసుకున్నారు. అందరూ సానుకూలంగానే ఉన్నారు” అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ కామెంట్స్..
”చంద్రబాబుకు మేమందరం ఉన్నాము అనే ఉద్దేశ్యంతో జైలుకి కూతవేటు దూరంలో ఈ సమావేశం పెట్టాం. జనసేన-టీడీపీ నాయకులు ఎలా కలిసి వెళ్ళాలి? అనే విషయంపై చర్చించాము. ప్రభుత్వం ఏర్పాటు చేశాక మరోసారి రాజమండ్రిలో సమావేశం పెట్టాలని ఆశిస్తున్నా”.

నారా లోకేశ్ కామెంట్స్..

”విజయదశమి రోజున ఈ కలయిన రాష్ట్రానికి మేలు చేసే కలయిక. జగన్ పాలనలో అన్ని కులాల వారిపై దాడులు జరుగుతున్నాయి. బీసీలకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం. 34 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రభుత్వ తన చేతకానితనంతో తాగునీటి ప్రాజెక్టులను గాలికి వదిలేసింది”.

ట్రెండింగ్ వార్తలు