Janasena : యువతకు కోసం శ్రీకాకుళం ‘రణస్థలం’లో జనసేన ‘యువశక్తి’ : నాదెండ్ల మనోహర్

యువతకు కోసం శ్రీకాకుళం ‘రణస్థలం’లో జనసేన ‘యువశక్తి’ కార్యక్రమం ఉంటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ యువత భరోసా కల్పించటానికి కీలక అంశాలు వెల్లడిస్తారని తెలిపారు.

Janasena : జనసేన పార్టీ మరో కార్యక్రమం నిర్వాహణకు సిద్ధమైంది. విశాఖలో జనసేన కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు అడ్డుకున్నారు. పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి విశాఖలో. దీంతో జనసేన రోడ్ షో కార్యక్రమం నిర్వహించలేకపోయింది. ఈక్రమంలో ఉత్తరాంధ్రలోనే జనసేన మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ‘యువశక్తి’. శ్రీకాకుళం జిల్లా జనవరి 12న యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తామని జనసేన పార్టీ పీఏసీ చైర్మన నాదెండల మనోహర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో రణస్థలంలో యువశక్తి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. యువతకు భరోసా ఇవ్వటానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈసందర్బంగా నాదెండ్ల మాట్లాడుతూ..జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం రథం ‘వారాహి’గురించి వైసీపీ పార్టీ నేతలు చేస్తున్న విమర్శలపై గట్టి కౌంటర్ఇచ్చారు. ‘వారాహి’ విషయంలో కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మరీ కంగారుపడిపోతున్నారు అంటూ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. జనసేన ఎప్పుడు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుందని ఈ విషయం బూతుల మాట్లాడటం తప్ప వేరే చాతకానివారి అర్థంకాదన్నారు. విమర్శలు చేయమని సీఎం ఇచ్చే ప్రోత్సాహంతో అత్యుత్సాహనికి పోయి ‘వారాహి‘ రంగుపై విమర్శలు చేయటం వైసీపీ నేతల అవగాహనరాహిత్యానికి నిదర్శనమన్నారు.

వారాహి వాహనం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని జనసేన పార్టీ పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ చట్టాలను ఉల్లంఘించే పనులు చేయదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు మార్చి కోర్టులో మొట్టికాయలు తిన్న వైసీపీకి వారాహి రంగు గురించి మాట్లాడే అర్హత లేదనే విషయాన్ని గుర్తించాలి అంటూ చురకలు వేశారు. రాబోయే ఎన్నికల్లో వారాహి ప్రచార వాహనంగా ఉంటుందని..స్పష్టంచేశారు. విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీలను సందర్శించడానికి వెళితే అడ్డుకుంటున్నారని..జగనన్న కాలనీలు ఒక పెద్ద కుంభకోణం అంటూ ఆరోపించారు. ఉమ్మడి ఏపీ విభజన విషయంలో నోరు మూసుకుని కూర్చుని ఇప్పుడు మాత్రం ఉమ్మడి ఏపీకే వైసీపీ మద్దతు తెలిపింది అంటూ వైసీపీ తాజాగా కొత్తరాగం అందుకుందని..రాష్ట్రం విడిపోయిన ఇన్నేళ్లకు మళ్లీ ఉమ్మడి ఏపీ అంటూ ఏవోవో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు నాదెండ్ల. మూడు రాజధానులంటే ప్రజలను అధోగతిపాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తోంది అంటూ విమర్శించారు.

బిసి గర్జనకు ఎన్ని ఆర్టీసీ బస్సులు వేశారని..ఏపీఎస్ ఆర్టీసీని వైఎస్ఆర్టీసీ గా మార్చేశారంటూ విమర్శలు చేశారు. సర్పంచులు పోరడుతోంటే చెక్ పవర్‌లు లాగేసుకుంటున్నారని ఇదీ వైసీపీ పాలను జరిగేది అన్నారు. వైసీపీ నేతల కబ్జాల గురించి సర్వే నెంబర్లతో సహా బాధితులు జననేనకు తమ బాధలు చెప్పుకుంటున్నారని తెలిపారు.జనవరి 12న యువతకు భరోసా ఇస్తూ రణస్ధలంలో యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు