×
Ad

జగన్‌ నా దేవుడు.. ఉదయం నిద్ర లేవగానే ఆయన ఫొటోకి దండం పెట్టుకుంటా: జయమంగళ వెంకటరమణ

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న జయమంగళ వెంకటరమణ కీలక వ్యాఖ్యలు చేశారు.

  • రాజకీయాల్లో నాది శకుని పాత్ర
  • 2014 ఎన్నికల్లో కామినేనికి సీటు ఇచ్చారు
  • పోటీ చేసి ఉంటే అప్పుడే మంత్రినయ్యేవాడిని

YS Jagan: “నా దేవుడు ఎప్పటికీ వైఎస్‌ జగన్ మెహన్ రెడ్డే.. ఉదయం నిద్ర లేవగానే జగన్ ఫొటోకి దండం పెట్టుకుంటా..” అని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. ఆ మాట పలు ఇంటర్వ్యూల్లో కూడా చెప్పానన్నారు.

Also Read: బంగ్లాదేశ్‌లో “డార్క్ ప్రిన్స్” రహమాన్ గెలుపు.. ఇక ఆ దేశంతో మళ్లీ భారత్‌.. ఎలాగంటే?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న జయమంగళ వెంకటరమణ కీలక వ్యాఖ్యలు చేశారు. “20 ఏళ్లు ఊడిగం చేస్తే… నాకు ఎవరూ ఏమీ చేయలేదు. పిలిచి పిల్లని ఇచ్చినట్టుచ పిలిచి పదవి ఇచ్చారు జగన్.

రాజకీయాల్లో నాది శకుని పాత్ర. 2014 ఎన్నికల్లో నాకు కాదని కామినేనికి సీటు ఇచ్చారు. నేను పోటీ చేసి ఉంటే అప్పుడే మంత్రిని అయ్యే వాడిని. జిల్లాలో కొలు రవీంద్ర కంటే సీనియర్‌ను నేను” అని అన్నారు.