నా బస్సులే ఎందుకు : కక్ష సాధింపు చర్యలు – జేసీ

  • Publish Date - November 15, 2019 / 11:22 AM IST

జగన్ ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. రాష్ట్రంలో ఎన్నో ట్రావెల్స్‌ ఉన్నా తన బస్సులను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత కక్ష సాధింపు చర్యలు ఇంతవరకు తాను చూడలేదన్నారు. 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారం 10tv ఆయనతో ముచ్చటించింది. ప్రస్తుతం వైసీపీ పరిపాలనలో 20 శాతం మేర ఈ కక్ష సాధింపు చర్యలున్నాయన్నారు.

తర్వాత..ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాగే ఉంటుందని..ఒకవేళ జగన్ మరలా అధికారంలోకి వస్తే..50 శాతం సాధింపు చర్యలుంటాయన్నారు. నేతలు పార్టీ మారడంపై ఆయన రెస్పాండ్ అయ్యారు. తానెవరికీ పార్టీ మారాలని చెప్పలేదని.. బయట ఉంటే బతకలేమనుకునే వారే పార్టీ మారుతున్నారని జేసీ తేల్చిచెప్పారు. 

జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేశ్ రెడ్డి ఇంటిపై శుక్రవారం ఏసీబీ దాడులు చేయడం కలకలం రేపింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై సోదాలు చేపట్టింది ఏసీబీ. రూ. 4 కోట్ల ఆస్తులున్నట్లు గుర్తించినట్లు సమాచారం. జేసీ పీఏగా పనిచేసిన సురేశ్..ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖలో ఏఈఈగా పనిచేస్తున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత సురేష్ ను కోర్టులో హాజరుపర్చారు ఏసీబీ అధికారులు.
Read More : ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి : వల్లభనేని వ్యాఖ్యలపై లోకేష్ స్పందన