JC hugging paritala sriram : పరిటాల శ్రీరామ్ ను కౌగలించుకున్న జేసీ బ్రదర్..రాయలసీమలో వెరీ ఇంట్రస్టింగ్ సీన్

రాయలసీమ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర దృశ్యం ఆవిషృతమైంది. కక్షలతో రగిలిపోయే రెండు కుటుంబాలు స్నేహంగా మారాయి.పరిటాల శ్రీరామ్ ను కౌగలించుకున్న జేసీ దివాకర్ రెడ్డి కౌగలించుకున్నారు.

jc diwakar reddy hugging paritala sriram : ఏపీలోని అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి జేసీ కుటుంబాల మధ్య ఉన్న వైరం గురించి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు.వారికి రాజకీయ పరంగానే కాదు కుటుంబాల మధ్య వ్యక్తిగత ఫ్యాక్షన్ వైరం కూడా ఉండేది. గతంలో జేసీ బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు.పరిటాల కుటుంబానికి టీడీపీ. కానీ ఇప్పుడు రెండు కుటుంబాలు టీడీపీలోనే ఉన్నాయి. కానీ రెండు కుటుంబాల మధ్య వైరం మాత్రం మారలేదు.వారి కుటుంబాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమనేది. కానీ ఉన్నట్లుండి పరిస్థితి మారిపోయిందా? ఇరు కుటుంబాల మధ్య కక్షలు కార్పణ్యాలు మాసిపోయాయా? స్నేహితులైపోయారా? అనే ఓ అత్యం ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది అనంతపురం జిల్లాలో.అదేమంటే మాజీ మంత్రి పరిటాల సునీత..దివంగత నేత పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ ను జేసీ కౌగలించుకున్నారు. ఇది ఒక్క అనంతపురం జిల్లాలోనే కాదు..ఏపీలోనే హాట్ టాపిక్ గా మారింది..! ఈ ఆసక్తికర ఘటన అనంతపురం పాలిటిక్స్ లో అత్యంత హాట్ టాపిక్ అయ్యింది..!!

Read more :  Chandrababu Naidu : ధైర్యం ఉంటే పోటీలో తలపడాలి…ప్రజలను మెప్పించి గెలవాలి

పరిటాల శ్రీరామ్, జేసీ దివాకర్‌ రెడ్డి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు. మాట్లాడుకున్నారు. ఒకరి బాగోగులు మరొకరు తెలుసుకున్నారు. ఈ సీన్ చూసిన రాయలసీమ జనం కొంతమంది షాక్ అవుతుంటే మరికొంతమంది మురిసిపోతున్నారు. ఆనంద పడిపోతున్నారు. ఎన్నాళ్టికి ఇటువంటి సన్నివేశం చూస్తున్నాం అంటూ తెగ ఆనంద పడిపోతున్నారు. ఒకప్పుడు అనంత జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనేది. అప్పుడు జేసీ బ్రదర్స్‌ది కాంగ్రెస్‌. పరిటాల రవి వర్సెస్ జేసీ బ్రదర్స్. ఓ రేంజ్‌ హైవోల్టేజ్‌ పాలిటిక్స్ నడిచేవి. పరిటాల మర్డర్‌ విషయంలోనూ అప్పట్లో జేసీ ఫ్యామీలపై ఆరోపణలు వచ్చాయి. కానీ పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు కదా..మనుషుల్లో మార్పులు సహజం అన్నట్లుగా మారాయి. జేసీ బ్రదర్స్‌ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు విభేదాలు కొనసాగినా ఈ మధ్యే కాస్త చేంజ్‌ వచ్చింది. గతంలో జేసీ కుమారులను కలిశారు పరిటాల శ్రీరామ్‌.

Read more  : JC Prabhakar Reddy: తాడిపత్రిలో హైటెన్షన్.. రాత్రి నుంచి మున్సిపల్ ఆఫీస్‌లోనే.. అధికారులకు వంగి నమస్కరించిన జేసీ

ఇప్పుడు వారు పాత గొడవలన్నీ మర్చిపోయి ఒక పార్టీలో ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వారు ఎక్కువగా కలసి, మెలిసి ఉంటున్నారు. నారా లోకేష్ అనంతపురం పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం చెప్పడానికి నేతలంతా వచ్చినప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి – పరిటాల శ్రీరామ్ ఆత్మీయ పలకరింపు అందర్నీ ఆకట్టుకుంది. మరెందరికో ప్రశ్నార్థకంగా మారింది. ఇంకొందరికి షాక్ గా మారింది.

Read more : Amaravati: అమరావతి పాదయాత్రకు పోలీసుల ఆంక్షలు..

హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నారా లోకేష్ అనంతపురం వెళ్లారు. ఈ సందర్భంగా లోకేష్ కు దారి పొడుగునా టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతపురంలోకి ఎంటరయ్యే సమయంలో ఆ జిల్లాకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ముందుగా జేసీ దివాకర్ రెడ్డి రాగా…తరువాత కొంతసేపటికి పరిటాల శ్రీరామ్ వచ్చారు. అయితే ఇటీవలి కాలంలో ఆ ఇద్దరూ ఎదురుపడిన సందర్భాలు అస్సలు లేవనే చెప్పాలి. దీంతో ఇద్దరు నేతల కార్యకర్తల మధ్య కాస్త టెన్షన్ వాతావరణ ఏర్పడింది. పరిస్థితి ఎలా ఉంటుందోనని ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు.అయితే పరిటాల శ్రీరామ్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి ఆప్యాయంగా పలకరించి హత్తుకోవడం.. పరిటాల శ్రీరామ్ కూడా అంతే ఆప్యాయంగా మాట్లాడటంతో పరిస్థితి తేలికగా మారింది. ఇది చాలా చాలా ఆనందంగా మారింది ఇరు వర్గాలవారికి.

వీరిద్దరి ఆత్మీయ పలకరింపు అనంతపురం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే అనంతపురం టీడీపీలో నేతల కంటే గ్రూపులు ఎక్కువ. అందరూ బలమైన నేతలే. దీంతో ఎవరికి వారు తమ తమ పెత్తనం ఉండాలనుకుంటారు. ఒకరిపై మరొకరు ఆధిపత్యం చేయాలనుకుంటారు. దీంతో గ్రూపులు గొడవలు ఉంటూనే ఉంటాయి. టీడీపీలో ఉన్నప్పటికీ పరిటాల, జేసీ వర్గాల మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా పొసిగేది కాదు. ఇద్దరు మాట్లాడుకోవటం పక్కనపెడితే మొహాలే చూసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా పరిస్థితులు మారుతున్నాయి. సంబంధాలు ఆహ్వానించతగినట్లుగా మారాయి. కలసి కట్టుగా అధికారపక్షంపై పోరాడేందుకు సిద్ధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. జేసీ, పరిటాల కుటుంబాల మద్య ఏర్పడిన ఈ అనూహ్య బంధం చూస్తుంటే. వీరిద్ధం సత్ససంబంద వైసీపీ కన్నుకుట్టుగా ఉంటుందనటంలో ఏమాత్రం సందేహం లేదంటున్నారు కొంతమంది..

Read more : JC Prabhakar Reddy: మున్సిపల్ ఆఫీసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన

అనంతపురంలో కొన్నాళ్ల కిందట కొన్ని గ్రూపులు ఉండేవి. పరిటాల, కేతిరెడ్డి, జేసీ వర్గాలు రాజకీయంగానే కాదు.. ఫ్యాక్షన్ పరంగానూ పోరాటాలు జరుగుతుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారిందనే చెప్పాలి. ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగానే పోరాడుకుంటున్నారు. పరిటాల- జేసీ వర్గీయుల మధ్య విభేదాలు తగ్గిపోతే జిల్లాలో తమకు తిరుగు ఉండదని టీడీపీ కార్యకర్తలు నమ్మకంతో ఉన్నారు. వీరిద్దరి మధ్యా ఏర్పడిన ఈ అనూహ్య..ఆనందకర బంధం ఇలాగే కొనసాగితే..అధికార పార్టీకి చిక్కువచ్చినట్లేనంటున్నారు స్థానికులు. రాజకీయ విశ్లేషకులు.

 

ట్రెండింగ్ వార్తలు