JC Prabhakar Reddy: తాడిపత్రిలో హైటెన్షన్.. రాత్రి నుంచి మున్సిపల్ ఆఫీస్‌లోనే.. అధికారులకు వంగి నమస్కరించిన జేసీ

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

JC Prabhakar Reddy: తాడిపత్రిలో హైటెన్షన్.. రాత్రి నుంచి మున్సిపల్ ఆఫీస్‌లోనే.. అధికారులకు వంగి నమస్కరించిన జేసీ

Jc Prabhakar Reddy (1)

JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మున్సిపల్ చైర్మన్ హోదాలో తలపెట్టిన సమీక్షా సమావేశానికి రాలేదంటూ మున్సిపల్ అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. సిబ్బంది గైర్హాజరుపై 26 మంది సిబ్బంది కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రాత్రంతా మున్సిపల్ ఆఫీసులోనే మకాం వేసి, అక్కడే నిద్రపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఉదయాన్నే స్నానం కూడా అక్కడే చేశారు.

అనంతరం కొద్దిసేపటి క్రితమే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కమీషనర్‌కు ఒంగి ఒంగి దండాలు పెడుతూ, అధికారుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పటిష్ట భందోబస్తుతో పోలీసులతో కలిసి కమీషనర్ కార్యాలయానికి రాగా.. పోలీసులు మున్సిపల్ కార్యాలయంలోకి రావద్దంటూ అడ్డుకున్నారు పోలీసులు. పోలీసులు కార్యాలయంలోకి వస్తే అవమానించినట్టే అని అన్నారు జేసి.

ఈ క్రమంలోనే కార్యాలయానికి వచ్చిన అధికారికి వినూత్నంగా నిరసన తెలియజేసి అధికారులు రాగానే లేచి వారికి వంగి వంగి దండాలు పెట్టారు. మున్సిపల్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. మున్సిపల్ సిబ్బందితో సమీక్ష సమావేశం పెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. గైర్హాజర్ అయిన అధికారులు అసలెక్కడికి వెళ్లారంటూ మున్సిపల్ చైర్మన్ హోదాలో వాకబు చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మున్సిపల్ సిబ్బందితో కరోనా వైరస్ మూడోదశపై అవగాహన ర్యాలీ, సమావేశం నిర్వహించారని, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరుకాక తప్పలేదని అధికారులు చెబుతున్నారు.

మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి సమాచారం కూడా ఇవ్వకుండా సెలవుపెట్టి వెళ్లడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తనకు మాట మాత్రం చెప్పలేదని అసహనం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశానికి హాజరు కాకుండా.. తన ఆదేశాలను పట్టించుకోని 26మంది మున్సిపల్ సిబ్బందికి నోటీసులు కూడా జారీ చేశారు.