Andhra Pradesh : వైద్యారోగ్యశాఖలో 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్యారోగ్యశాఖలో వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న 14,200 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.

Andhra Pradesh : నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్యారోగ్యశాఖలో వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న 14,200 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్… ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్టోబరు నుంచి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించి, నవంబరు 15 నాటికి ముగించాలని అధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండరాదని అన్నారు.

Read More : Ratan Tata : వీధి కుక్కకు గొడుగు పట్టాడు, రతన్ టాటా మనసు గెలిచాడు

ఇక ఈ సందర్బంగా వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఔషదాల కొరత లేదని తెలిపారు. కరోనా సాయంలో ఐదు రేట్ల ఔషదాలు కొనుగోలు చేసినట్లు వివరించారు. ఈ ఔషధీ వెబ్ సైట్ లో ఎక్కడ సమస్యలు లేవని తెలిపారు. అవసరాలకు అనుగుణంగా ఔషధాలు అందిస్తున్నామని భాస్కర్ వివరించారు.

Read More : Festival : పండుగ సీజన్.. వీటి ధరలకు రెక్కలు

ట్రెండింగ్ వార్తలు