×
Ad

Fake Liquor Case: ఎవరినో అరెస్టు చేసి.. నా పేరు చెబితే అయిపోద్దా? తగ్గేదేలే..: జోగి రమేశ్

"కేసులకు భయపడే పసక్తే లేదు. నాపై కేసు పెడితే ఆగిపోతానా?" అని అన్నారు.

Jogi Ramesh - Janardan

Fake Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం వ్యవహారంపై నిరసనలు తెలిపామని, జగనన్న పిలుపుతో కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టించామని వైసీపీ నేత జోగి రమేశ్ అన్నారు. నకిలీ మద్యం కేసులో ఏ1 జనార్దన్ రావు సంచలన విషయాలు తెలిపిన విషయం తెలిసిందే. అంతా జోగి రమేశే చేయించాలని జనార్దన్‌ రావు చెప్పారు.

దీనిపై జోగి రమేశ్ స్పందిస్తూ.. “మీరు ఎవరినో అరెస్టు చేశారు. నా పేరు చెప్పాలని అతడితో అన్నారు. కేసులకు భయపడే పసక్తే లేదు. నాపై కేసు పెడితే ఆగిపోతానా?” అని అన్నారు.

“జోగి రమేశ్ అనే నేను.. నమ్ముకున్న నా కుటుంబం సాక్షిగా.. నా భార్యాబిడ్డల సాక్షిగా.. నా బలహీన వర్గాల సాక్షిగా.. నా రక్త సంబంధికులైన మా గౌడ జాతి అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సాక్షిగా.. నేను అడుగులో అడుగు వేసి నడిచిన నా వంగవీటి మోహన రంగా అభిమానుల సాక్షిగా రాష్ట్ర ప్రజలకు చెబుతున్నాను. ఈ కేసులో నేను చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా ఇన్వాల్వ్ అయి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని మీ ద్వారా తెలియజేస్తున్నాను” అని అన్నారు. కల్తీ లిక్కర్ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని జోగి రమేశ్ చెప్పారు.

Also Read: నేను కాదు.. మొత్తం చేసింది వైసీపీ లీడర్ జోగి రమేశే..: నకిలీ మద్యం నిందితుడు సంచలనం

కాగా, ఏపీ నకిలీ మద్యం కేసులో అధికారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. జనార్దన్‌ రావు సన్నిహితులపై ఎక్సైజ్‌ శాఖ ఫోకస్‌ పెట్టింది. హైదరాబాద్‌, విజయవాడలో ఉన్న జనార్దన్‌ స్నేహితుల ఇళ్లలో ఎక్సైజ్‌ అధికారుల సోదాలు జరుపుతోంది. జనార్దన్‌ రావు వ్యాపార భాగస్వాముల నుంచి కూడా కీలక వివరాలు రాబడుతున్నారు.