KA Paul: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి గురించి ఐరాస సెక్రటరీ జనరల్‌కి లేఖ రాశా: కేఏ పాల్

డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు నాగబాబుకి రాజ్యసభ ఇస్తున్నారని, జనసేనను బీజేపీలో విలీనం చేసే పని జరుగుతుందని అన్నారు.

KA Paul

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఆపడంపై భారత ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. విదేశాంగ మంత్రిని బాంగ్లాదేశ్ కి పంపి చర్చలు జరపాలని చెప్పారు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి గురించి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కి లేఖ రాశానని చెప్పుకొచ్చారు.

ఇవాళ కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీని కాలుష్యం ఇబ్బంది పెడుతున్నప్పటికీ పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీలోనే పెడుతున్నారని అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు హైదరాబాద్ లో నిర్వహించాలని చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని తెలిపారు.

డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు నాగబాబుకి రాజ్యసభ ఇస్తున్నారని, జనసేనను బీజేపీలో విలీనం చేసే పని జరుగుతుందని అన్నారు. అందుకే పవన్ సనాతనం, లడ్డూల గురించి మాట్లాడుతున్నారని, ఏపీకి ప్రత్యేకహోదా అంశాన్ని పవన్ మర్చిపోయారని తెలిపారు. 15 కోట్ల మంది తెలుగు ప్రజలను తాకట్టు పెట్టి ప్యాకేజి స్టార్లుగా మారారని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై చంద్రబాబు, పవన్ మాట్లాడటం లేదని తెలిపారు. చంద్రబాబు ఆరు నెలలలో 60 వేల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ బీజేపీ తొత్తులుగా మారారని తెలిపారు.
ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వ వైఖరి ఎంటనేది కోర్టుకు చెప్పడం లేదని అన్నారు.

కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా చేయడం అవినీతి కిందకు వస్తుందని తెలిపారు.బియ్యం అక్రమ తరలింపుపై సీబీఐ దర్యాప్తు జరగాలని అన్నారు. దేశ నాయకులకు తెలిసే అక్రమ రవాణా జరుగుతుందని తెలిపారు. అదానీ, మోదీ ప్రభుత్వ కంట్రోల్లో పోర్టులు ఉన్నాయని చెప్పారు. పవన్ నోరు మూయించడం కోసం చంద్రబాబు సమావేశం పెట్టారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర భవిష్యత్ మారుతుందని అన్నారు.

Perni Nani: పవన్ కల్యాణ్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను: పేర్ని నాని