విపక్షాలకు షాక్.. వైఎస్ వివేకా హత్యపై కడప కోర్టు సంచలన నిర్ణయం!

YS Viveka Case : వైఎస్‌ వివేకా హత్యపై ఎవరూ మాట్లాడొద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది.

YS Viveka Case : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై కడప కోర్టు సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. వైఎస్‌ వివేకా హత్యపై ఎవరూ మాట్లాడొద్దంటూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. ముఖ్యంగా వైఎస్ వివేకా హత్యపై ఆరోపణలు చేసే వైఎస్‌ షర్మిల, సునీత, ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌లకు కోర్టు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది.

Read Also : Sajjala Ramakrishna Reddy : సీఎం జగన్‌పై దాడి వెనుక కుట్ర ఉంది- సజ్జల సంచలన వ్యాఖ్యలు

నారా లోకేష్‌, పురందేశ్వరిని కూడా వివేకా హత్యపై ప్రస్తావించొద్దని కోర్టు సూచించింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో విపక్ష నేతలందరూ ప్రధానంగా అధికార వైసీపీని లక్ష్యంగా వైఎస్ వివేకా హత్యపైనే విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ నేత సురేష్‌బాబు కడప కోర్టును ఆశ్రయించారు.

వైఎస్ వివేకా హత్యపై ప్రస్తావించకుండా ఉండేలా విపక్ష నేతలకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. ఇందులో షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేష్‌, పురందేశ్వరి, పవన్‌, రవీంద్రనాథ్‌రెడ్డి ని ప్రతివాదులుగా చేర్చారు. పిటిషనర్ తరుపున న్యాయవాది నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై విచారించిన కడప కోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. వైఎస్ వివేకా హత్యపై ఎవరూ ప్రస్తావించరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Read Also : Attack On CM Jagan : సీఎం జగన్‌‌ను హత్య చేసేందుకే దాడి- రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

ట్రెండింగ్ వార్తలు