Andhra pradesh: వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ కాకాణి గోవర్ధన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్ లో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు...

Minister Kakani Govardhan

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్ లో వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కాకాణి రెండు ఫైళ్ల పై సంతరం చేశారు. తొలుత సంతకం చేశారు. 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇరిగేషన్ అవకాశం కల్పించే ఫైల్ పై ఆయన సంతకం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైల్ పై రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ రైతుల పక్షపాతి అని, ఇప్పటి వరకు రూ. 20 వేల కోట్లకు పైగా రైతు భరోసా నగదును బదిలీ చేశామని అన్నారు.

Minister Kakani : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తనకు వ్యవసాయ మంత్రిగా రైతులకు సేవచేసుకొనే అవకాశం కల్పించిన సీఎం జగన్ కు కాకాణి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ. 43వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. గన్నవరంలో రాష్ట్ర విత్తన పరిశోధన, శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల అవసరాలు తీర్చేలా పీఏసీ ఖాతాలకు అనుసంధానం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.