Family Commits Suicide
family commits suicide : ఏపీలోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి కుటుంబంలో నలుగురూ ఒకేసారి చనిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఒక కుమారుడు. ఒక కుమార్తె ఉన్నారు.
కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని స్థానికుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు.పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా..ఇటీవల సన్నిహితులు, బంధువులు మరణించడంతోనే ఆ కుటుంబం మనస్తాపానికి గురైందని ఆత్మహత్య లేఖ ద్వారా పోలీసులు గుర్తించారు. మృతుల్లో దంపతులు ప్రతాప్, హేమలతతో పాటు కుమారుడు జయంత్, కుమార్తె రిషిత ఉన్నారని పోలీసులు చెప్పారు. ప్రతాప్ టీవీ మెకానిక్ గా పనిచేస్తున్నాడని..ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.